Breaking News

ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌లపై కాంగ్రెస్ కీలక నిర్ణయం!

Published on Wed, 11/20/2024 - 16:30

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మహారాష్ట్రలో 45.53శాతం పోలింగ్‌ నమోదు కాగా.. అటు ఝార్ఖండ్‌లో 61.47శాతం ఓటింగ్‌ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సామాన్యులతోపాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌ పూర్తయిన తర్వాత సాయంత్రం 6.30 గంటలకు ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడనున్నాయి.

ఈ క్రమంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్‌పై టీవీ ఛాఆనళ్ల చర్చల్లో పాల్గొనకూడదని హస్తం పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం,గతంలో లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి నిర్ణయమే కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అయితే ఓటమి భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో బీజేపీ విమర్శలు గుప్పించింది.

కాగా మహారాష్ట్రలో ఒకేవిడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. ఝార్ఖండ్‌లో రెండోవిడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు పలు రాష్ట్రాల్లోని కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబరు 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.

ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి పోటాపోటీగా తలపడ్డాయి. నువ్వానేనా? అన్నట్టుగా రెండు పార్టీలు బరిలోకి దిగాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఇండియా కూటమి భావిస్తోంది. 

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు