Breaking News

Ayodhya : ఎన్నికల్లో లబ్ధికే రామ్‌ మందిర వేడుక : కాంగ్రెస్‌

Published on Fri, 01/12/2024 - 16:01

న్యూఢిల్లీ: అయోధ్యలో జరగబోయే రామ మందిర ప్రారంభ వేడుక ఫక్తు రాజకీయ కార్యక్రమమని కాంగ్రెస్‌ విమర్శించింది. ఇంకా నిర్మాణం పూర్తికాని గుడిని కేవలం రాజకీయ లబ్ధి కోసం రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టకుని బీజేపీ ప్రారంభిస్తోందని మండిపడింది. ఈ మేరకు ఢిల్లీలో శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ నేతలు సుప్రియా ష్రినేట్‌, పవన్‌ ఖేరా మీడియాతో మాట్లాడారు.

జ్యోతిర్‌ మఠం చీఫ్‌ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్‌ సరస్వతి కూడా రామ మందిర వేడుకకు రావడం లేదని ప్రకటించిన విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు గుర్తు చేస్తున్నారు. గుడిలో రాముని విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించలేదని అందుకే శంకరాచార్య వేడుకకు రానని ప్రకటించారని ఖేరా చెప్పారు.

పూర్తిగా నిర్మాణం జరగని గుడిలో రామునికి ప్రాణ ప్రతిష్ట ఎలా జరుపుతారని నలుగురు శంకరాచార్యలు ఇప్పటికే ప్రశ్నించారన్నారు. రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన అనంతరం  కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేకంగా ఒక రోజు రామ మందిరాన్ని సందర్శిస్తారని ఖేరా తెలిపారు. ‘దేవునితో ఒక వ్యక్తి ఆడే రాజకీయ డ్రామాను మేం అంగీకరించం’అని ఖేరా స్పష్టం చేశారు.

కాగా,ఈ నెల 22న అయోధ్యలో జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ట వేడుకకు దూరంగా ఉంటామని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్టకు హాజరవకపోవడం కాంగ్రెస్‌ మూర్ఖత్వానికి నిదర్శనం బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.    

ఇదీచదవండి.. నాసిక్‌లో మోదీ ఆధ్యాత్మిక పర్యటన.. భక్తులతో కలిసి రాం భజన 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)