Breaking News

‘విమాన’ సంక్షోభంపై మంత్రి రామ్మోహన్‌ను నిలదీసిన ఎంపీలు

Published on Tue, 12/09/2025 - 03:17

సాక్షి, న్యూఢిల్లీ: ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు­ను ఎంపీలు నిలదీశారు. సంక్షోభం జరుగుతున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. టికెట్ల ధరలు రూ.50 వేలు, రూ.60 వేలు, రూ.75 వేలు, రూ.1 లక్ష ఏమిటని మండిపడ్డారు. తమ ప్రశ్నలకు మంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పిన సమాధానాలపై ఆ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సూటిగా సమాధా­నం చెప్పకుండా ఏదేదో చెబుతున్నారంటూ ఆగ్ర­హం వ్యక్తం చేస్తూ రాజ్యసభ నుంచి ఇండియా కూ­టమి ఎంపీలు వాకౌట్‌ చేశారు.

మరోపక్క జాతీయ మీడియాతో పాటు, అన్ని రాష్ట్రాల మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో జరిగే డిబేట్స్‌లో పాల్గొంటున్న వక్తలు, నెటిజన్లు కేంద్రమంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. సోమవారం రాజ్యసభ జీరో అవర్‌లో పౌరవిమానయానశాఖపై పలువురు ఎంపీ­లు ప్రశ్నలు సంధించారు. వీరిలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, అన్నాడీఎంకే వారున్నారు. ఆటోమేటిక్‌ మెసేజ్‌ స్విచింగ్‌ సిస్టమ్‌ (ఏఎంఎస్‌ఎస్‌), ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలు, ఇండిగో సంక్షోభం, టికెట్ల ధరలు, క్యాన్సిలేషన్‌ రీఫండ్‌ తదితర సమస్య­లపై ఎంపీలు ప్రశ్నలు వేశారు. వీటికి కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మౌఖిక సమాధానమిచ్చా­రు. ‘ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలను రూపొందించేముందు మేం అందరితో చర్చించాం. నవంబర్‌ 1 నుంచి రెండోదశ నిబంధనలు అమల్లోకి తెచ్చాం.

అవి అమల్లోకి వచ్చాక నెలవరకు సర్విసులు సజావుగా సాగాయి. డిసెంబర్‌ 3 నుంచే ఈ సమస్య తలెత్తింది. ఇండిగో అంతర్గత సమస్యల వలనే ఈ సంక్షోభం ఏర్పడింది’ అని చెప్పారు. ఈ సమాధానాలపై ఎంపీలు రాంజీలాల్‌ సుమన్, ప్రమోద్‌ తివారీ, డాక్టర్‌ తంబిదొరై తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. . సంక్షోభం రాబోతోందని తెలిసి కూడా ముందే ఎందుకు అడ్డుకోలేకపోయారని నిలదీశారు. పైలెట్‌ రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వల్లే విమాన సర్వీసులు రద్దయ్యాయని, తాము ప్రయాణికులకు భరోసా కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. మీరు ధరలను నియంత్రిస్తే నేను రూ.75 వేలు ఖర్చుచేసి టికెట్‌ ఎందుకు కొంటానంటూ అన్నాడీఎంకే ఎంపీ డాక్టర్‌ తంబిదొరై మంత్రిని ప్రశ్నించారు.

ఇప్పటి వరకు 5,86,705 టికెట్లు క్యాన్సి­ల్‌ అయ్యాయని, వీటికి దాదాపు రూ.569 కోట్లు రీఫండ్‌ చేశారని మంత్రి సమాధానమిచ్చారు. తాము ఒకటి అడిగితే మంత్రి మరొకటి చెబుతున్నారంటూ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశవ్యాప్తంగా విమాన సంక్షోభం ఏర్పడితే దాన్ని అరికట్టడంలో కేంద్రమంత్రి పూర్తిగా వైఫల్యం చెందారు. ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలు రెండోదశవి నవంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తే డిసెంబర్‌ నెల మొదటి వారంలో ఇండిగో సంక్షోభం ఎందుకు ఏర్పడింది? వీటిపై మీకు ముందే తెలిసినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదా? మేం అడిగే వాటికి మీరెందుకు సూటిగా సమాధానం చెప్పటంలేదు..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీలు సభనుంచి వాకౌట్‌ చేశారు.

రామ్మోహన్‌నాయుడిపై ఆగ్రహజ్వాలలు  
కేంద్రమంత్రిపై ప్రజల్లో ఇంకా ఆగ్రహజ్వాలలు తగ్గలేదు. జాతీయ మీడియాతో పాటు అన్ని రాష్ట్రాలకు చెందిన మీడియాలోను డి­బే­ట్లు పెట్టి కేంద్రమంత్రి రామ్మోహన్‌ తీరు­ను ఎండగడుతున్నారు. లక్షలాదిమంది ప్రయా­ణికులు అష్టకష్టాలు పడుతుంటే మంత్రికి కనిపించడం లేదా అంటూ నిలదీస్తున్నారు. ఇండిగో సంక్షోభం రాబోతుందని ముందే తెలిసినా మంత్రి మౌనంగా ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఫ్‌లైట్‌క్యాన్సిల్‌ అయినప్పుడు క్షణాల వ్యవధిలో రీఫండ్‌ వచ్చేలా ఎందుకు చేయలేకపోయారంటూ మండిపడుతున్నారు.

దేశంలోని అన్ని విమానాశ్రయాలు.. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లను తలపిస్తున్నాయని పేర్కొంటున్నారు. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రయాణికులకు మంత్రి ఎందుకు భరోసా కల్పించలేదని నిలదీస్తున్నారు. కేంద్రమంత్రి తన పదవికి గౌరవంగా రాజీనామా చేయాలంటూ మీడియా డిబేట్లలో కూర్చున్న విశ్లేషకులు డిమాండ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో సైతం ఈ డిమాండ్‌ రోజురోజుకు పెరగడం గమనార్హం. కేంద్రమంత్రి తీరును ఎండగడుతూ ఎక్స్‌ వేదికగా నెటిజన్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)