లోపల ఉన్న వాళ్లే కరుస్తారు

Published on Tue, 12/02/2025 - 05:50

న్యూఢిల్లీ: శీతాకాల సమా వేశాలకు హాజరయ్యేందుకు పార్లమెంట్‌కు వచ్చిన కాంగ్రెస్‌ ఎంపీ రేణుకాచౌదరి వెంట కారులో ఒక వీధిశునకాన్ని తీసుకురావడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా రేణుకా దీటుగా బదులిచ్చారు. సోమవారం ఉదయం ఒక వీధిశునకాన్ని ఆమె కాపాడి ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత వెటర్నరీ వైద్యునికి చూపించేందుకు బయల్దేరారు.

 డ్రైవర్‌ ఈమెను మార్గమధ్యంలో పార్లమెంట్‌ వద్ద దింపేసి వెటర్నరీ ఆస్పత్రికి వెళ్తామనుకున్నాడు. ఈలోపే పార్లమెంట్‌ వద్ద రేణుక కారులో కుక్క ఉండటం చూసి బీజేపీ నేతలు విమర్శలు మొదలెట్టారు. పార్లమెంట్‌లో చర్చించాల్సిన అంశాలు ఎంత ముఖ్యమైనవో కాంగ్రెస్‌ నేతలకు బోధపడటం లేదు. ఇలా కుక్కలను తీసుకొచ్చి తమాషా చేస్తున్నారు. ఈ అంశాన్ని రాజ్యసభ ఛైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లాలి ’’ అని బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్‌ అన్నారు. దీంతో రేణుకాచౌదరి తీవ్రంగా స్పందించారు. ‘‘ 

ప్రభుత్వానికి అసలు కుక్కలంటే గిట్టదనుకుంటా. జంతువులు సమస్యలు చెప్పుకోలేవు. అయినా ఈ శునకం నా కారులో ఉందికదా. బయటకు రాలేదు. అయినా ఇది చాలా చిన్న కుక్క. ఇవేమీ కరవవు. కరిచే వాళ్లు వేరే ఉన్నారు. వాళ్లు పార్లమెంట్‌ లోపల ఉన్నారు. వీధిశునకాలను కాపాడకూడదని ఏ చట్టంలో రాసి ఉంది? ’’అని రేణుక వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే వెటకారంగా స్పందించారు. ‘‘ ఆమె చెప్పింది నిజమే. కుక్కలు అస్సలు కరవవు. విపక్ష సభ్యులు ముఖ్యంగా ఆమె సొంత పార్టీ నేతలే ఇరుసభల్లో హంగామా సృష్టించి కరిచినంత పనిచేస్తారు. పార్లమెంట్‌కు మీరు కుక్కలను వెంట తీసుకొస్తే మేం అధికారాన్ని వెంట తీసుకొస్తాం’’ అని అన్నారు.  
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)