Breaking News

'యూరిన్ పోసి.. ఎమ్మెల్యే కాళ్లు నాకించారు..' దళితునిపై దారుణం..

Published on Fri, 08/11/2023 - 19:28

జైపూర్‌: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. రక్షించాల్సిన పోలీసే ఓ దళిత వ్యక్తిపై అమానవీయంగా ప్రవర్తించాడు. బాధితునిపై యూరిన్ పోశాడు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే కాళ్లు నాకించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై క్రై బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గోపాల్‌ మీనా, పోలీసు అధికారి శివకుమార్‌ భరద్వాజపై కేసు నమోదు చేశారు. 

తాను పొలంలో పనిచేస్తుండగా.. పోలీసులు వచ్చి ఓ గదిలోకి తీసుకెళ్లారని బాధితుడు(51) ఫిర్యాదులో తెలిపారు. అక్కడ డీఎస్పీ శివ కుమార్ భరద్వాజ తనపై యూరిన్ పోసి అవమానించాడని పేర్కొన్నాడు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే గోపాల్ మీనా ఆ ప్రాంతానికి రాజని.. అతని మాటకు ఎదురులేదని చెప్తూ ఎమ్మెల్యే బూట్లు నాకించారని పోలీసులకు తెలిపాడు.  

తన ఫోన్‌ను లాక్కున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు తెలిపాడు. మొదట పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను నేరుగా కోర్టునే ఆశ్రయించినట్లు తెలిపాడు. ఫిర్యాదు చేసిననాటి నుంచి బెదిరింపులు వస్తున్నాయని 

నిందితులకు భయపడే జూన్ 30న ఈ ఘటన జరగగా.. జులై 27న ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వెల్లడించాడు. తన కుటుంబ సభ్యులను కూడా వేదిస్తున్నారని తెలిపాడు. అయితే.. దళిత వ్యక్తిపై నిందితులు ఈ ఘటనకు పాల్పడటానికి కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

ఇదీ చదవండి: నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు..

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)