Breaking News

రెండు ఎమ్మెల్సీలనూ కొట్టాల్సిందే

Published on Thu, 07/30/2026 - 06:08

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో పట్టభధ్రులకు మరింత దగ్గరయ్యేలా, వచ్చే ఫిబ్రవరిలో జరిగే రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలనూ గెలుచుకునేలా ఇప్పటినుంచే నేతలంతా పనిచేయాలని పీసీసీ సమన్వయ కమిటీలో నిర్ణయించారు. గ్రాడ్యుయేట్‌ స్థానాలకు ఆగస్టులోగా అభ్యర్థుల ఎంపికపై నిర్ణయానికి రావాలని నిశ్చయించారు. ఇందుకోసం మహబూబ్‌నగర్‌–హైదరాబాద్‌–రంగారెడ్డి జిల్లాలకు ఎన్నికల ఇన్‌చార్జిగా మంత్రి దామోదర రాజనర్సింహకు బాధ్యతలు కట్టబెట్టారు. ఆయన ఇతర మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి అభ్యర్థిపై నిర్ణయానికి రావాలని నిర్ణయించారు. నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ స్థానానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను ఇన్‌చార్జీలుగా నియమించారు.

మంత్రులు తమ జిల్లాల కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు (డీసీసీ), ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో విస్తృతంగా చర్చించి.. ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ ద్వారా పార్టీ అధిష్టానానికి నివేదిక సమరి్పంచాలని నిర్ణయించారు. సెప్టెంబర్‌ నుంచి ఓటరు ఎన్‌రోల్‌మెంట్‌ ప్రక్రియను విస్తృతంగా జరపాలనే నిశ్చయానికి వచ్చారు. రెండు స్థానాలను గెలిపించుకునేలా ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా నేతలు కృషి చేయాలని అధిష్టానం సూచించింది. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ జాతీయ కార్యాలయం ’ఇందిరా భవన్‌’లో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ అధ్యక్షతన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సర్‌’ప్రక్రియపైనా చర్చించారు. పార్టీ, ప్రభుత్వ మధ్య మరింత సమన్వయం, ప్రభుత్వ పథకాల ప్రచారంపై ఓ యాక్షన్‌ప్లాన్‌ను తయారు చేసే అంశంపై విస్తృత చర్చ జరిగింది.  

సెప్టెంబర్‌ 15 తర్వాతే కొత్త కార్పొరేషన్లు 
ఇక రాష్ట్రంలో ఇటీవల గడువు ముగిసిన కార్పొరేషన్‌లతోపాటు, కొత్త కార్పొరేషన్‌లకు చైర్మన్‌లు, ఇతర సభ్యుల నియామకాలను సెప్టెంబర్‌ 15 తర్వాత నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. రెండేళ్లపాటు పనిచేసిన కార్పొరేషన్‌ చైర్మన్‌లను కొనసాగించాలని కొందరు, వారిని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని మరికొందరు వాదిస్తున్న నేపథ్యంలో దీనిపై తుది నిర్ణయానికి వచ్చేందుకు కొంత గడువు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్రంలో మిగిలిపోయిన సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల డీసీసీ అధ్యక్షుల ఎంపికకు మరోమారు ఏఐసీసీ పరిశీలకులను హైదరాబాద్‌ పంపాలని నిర్ణయించారు.

సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు ప్రధాన పోటీదారుల్లో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై సందిగ్ధత నెలకొనగా, రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు నేతల పేర్లపై పీఠముడి నెలకొంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపికను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని అధిష్టానం చెప్పినట్లు సమాచారం. ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్‌)పై ఇప్పటికే బీఎల్‌ఏల పనితీరుపై కమిటీ భేటీలో సంతృప్తి వ్యక్తంకాగా, వెనకబడిన నియోజకవర్గాల్లో మరింత దూకుడుగా ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు.  

పథకాలకు ఇంటింటికీ చేర్చడానికి యాక్షన్‌ ప్లాన్‌: భట్టి  
కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ కేడర్, సంస్థాగత వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికీ చేర్చేందుకు ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాబోయే గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి సమన్వయ కమిటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ, పారీ్ట–ప్రభుత్వ సమన్వయం, సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)