Breaking News

ఎల్‌ఏసీ వద్ద పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

Published on Tue, 06/20/2023 - 06:12

న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చైనాతో సరిహద్దు వివాదంపై పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చ జరపాలని డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌ ప్రతినిధి మనీష్‌ తివారీ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘సరిహద్దులు దాటి మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదు. మన ఆర్మీ పోస్టులను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని మూడేళ్ల క్రితం గల్వాన్‌ ఘర్షణలు జరిగాక అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ చెప్పారు.

చైనా సైనికులు సరిహద్దులు దాటి చొచ్చుకొచ్చేందుకు, మన భూభాగంలో టెంట్లు వేసేందుకు ప్రయతి్నంచడంతో గల్వాన్‌ ఘటన జరిగిందంటూ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇవి రెండూ పరస్పర విరుద్ధ ప్రకటనలు’అని తివారీ తెలిపారు. అందుకే భారత్‌–చైనా సరిహద్దు వివాదంపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరపడంతోపాటు గత మూడేళ్లుగా ఎల్‌ఏసీ వెంట జరుగుతున్న వాస్తవ పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బాధ్యతాయుత ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ కోరుతోందన్నారు. ‘ఎల్‌ఏసీ వెంట ఉన్న 65 పెట్రోలింగ్‌ పాయింట్లకు గాను 26 వరకు మన ఆర్మీ నియంత్రణలో లేవన్న విషయం నిజమా? చైనా ఆక్రమణలను మనం ఎందుకు ఆపలేకపోయాం?’అని తివారీ కేంద్రాన్ని నిలదీశారు.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు