Breaking News

అర నిమిషంలో 27 కత్తిపోట్లు!

Published on Tue, 08/04/2026 - 10:17

పట్టపగలు.. అదీ అందరూ చూస్తుండగానే ఓ పోకిరీ దారుణానికి తెగబడ్డాడు. తనపై ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఓ యువతిపై కిరాతానికి పాల్పడ్డాడు. టీచర్‌పై జరుగుతున్న దాడిని చూసి పిల్లలు, తోటి సిబ్బంది దూరంగా పరిగెత్తగా.. రక్తపు మడుగులో కుప్పకూలి ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.

ఫరీదాబాద్‌ సిక్రోనా గ్రామంలోని సరస్వతి సీనియర్‌ సెకండరీ స్కూల్‌లో 29 ఏళ్ల సంధ్య టీచర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం సాధారణంగా పాఠశాలకు వచ్చిన ఆమెను కలవాలంటూ ఓ యువకుడు గేటు వద్దకు వచ్చాడు. సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సంధ్య బయటకు వెళ్లగా.. అప్పటికే ముసుగు ధరించి ఉన్న నిందితుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. నిందితుడు పాఠశాల లోపలే కొంతసేపు వేచి చూశాడు. సంధ్య బయటకు రాగానే ఆమెను పట్టుకుని లాగి కత్తితో వరుసగా పొడిచాడు. ముఖం, మెడ, ఛాతి, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. అర నిమిషంలో దాదాపు 20 నుంచి 30 సార్లు కత్తితో దాడి చేసినట్లుప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ అరుపులు విని పాఠశాల నిర్వాహకుడు తేజ్‌పాల్‌ అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే నిందితుడు అతడిపై కూడా కత్తితో దాడికి యత్నించడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అనంతరం సంధ్యపై మరోసారి దాడి చేసి బైక్‌పై పరారయ్యాడు.

రెండు గంటల్లో అరెస్ట్‌
ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగాడు. నిందితుడి కోసం గాలించి.. రెండే గంటల్లో అరెస్ట్‌ చేశాడు. అతన్ని అమిత్‌(21)గా గుర్తించగా.. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడు.

వేధింపుల కేసే కారణమా?
ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమిత్‌కు సంధ్యతో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. ఆమె మాట్లాడేందుకు ఆసక్తి చూపకపోయినా.. నిందితుడు వెంటపడుతూ వేధించేవాడని తెలుస్తోంది. వేధింపులు ఎక్కువయ్యే సరికి ఈ మధ్యే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు కూడా నమోదు అయ్యింది. అయితే ఫిర్యాదు తర్వాత అమిత్‌ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో ఆమె కేసు వాపసు తీసుకుంది. అయితే ఆ ప్రతీకారంతోనే ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)