Breaking News

బొగ్గు గని ప్లాంట్‌ వద్ద నిరసన సెగ

Published on Sun, 12/28/2025 - 06:05

రాయ్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌ జిల్లాలో జిందాల్‌ పవర్‌ లిమిటెడ్‌కు సంబంధించిన బొగ్గు గని ప్లాంట్‌ వద్ద స్థానికులు చేపట్టిన ఆందోళన శనివారం హింసాత్మకంగా మారింది. తమనార్‌ పరిధిలోని లిబ్రా గ్రామంలో ఉన్న కోల్‌ హ్యాండింగ్‌ ప్లాంట్‌ నుంచి బొగ్గు తరలించే వాహనాలను అడ్డుకుంటూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఉద్యమ నాయకుడు రాధేశ్యామ్‌ శర్మ, మరో 40 మందిని అరెస్ట్‌చేసి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంచేశారు. 

అయితే సైకిల్‌పై వెళ్తున్న స్థానికుడిని మరో బొగ్గు ట్రక్కు ఢీకొట్టిందన్న వార్తతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయి పోలీసులపైకి రాళ్లు రువ్వారు. తర్వాత ప్లాంట్‌లోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించారు. కోల్‌ ప్లాంట్‌లోని కన్వేయర్‌ బెల్ట్, ట్రాక్టర్లు, పోలీస్‌ బస్సు, జీప్‌కు నిప్పుపెట్టారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసులు గాయపడ్డారు. సెక్టార్‌–1 కోల్‌బ్లాక్‌ పరిధిలోని 14 గ్రామాలకు చెందిన వేయి మందికిపైగా గ్రామస్తులు ఈ విధ్వంసకాండలో పాల్గొన్నారు.  అయినాసరే పరిస్థితి అదపులోనే ఉందని జిల్లా ఎస్పీ శనివారం వెల్లడించారు.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)