Breaking News

జ్ఞానవాపిని దర్శించుకున్న సీఎం యోగి!

Published on Wed, 02/14/2024 - 09:59

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారణాసిలోని జ్ఞానవాపిని సందర్శించుకున్నారు. అక్కడి నేలమాళిగలోని విగ్రహాలను వీక్షించారు. దేశానికి, రాష్ట్రానికి మంచి జరగాలని అక్కడ కొలువైన దేవతలను వేడుకున్నారు. 

సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సాయంత్రం వారణాసికి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 21 నుంచి 24 మధ్య వారణాసిలో పర్యటించనున్నారు. పూర్వాంచల్ అభివృద్ధికి దోహదపడే అమూల్ ప్లాంట్‌కు ప్రధాని మోదీ గతంలో శంకుస్థాపన చేశారు. ఇప్పుడు దీనిని ఫిబ్రవరి 23న ఆయన ప్రారంభించనున్నారు. వారణాసిలోని కార్ఖియాగావ్‌లో జరిగే భారీ బహిరంగ సభతో ప్రధాని మోదీ ఎన్నికల సైరన్‌ మోగించనున్నారు. 

ఈ సభకు లక్ష మందికి పైగా జనం తరలివస్తారని అంచనా. ఈ సభ ఏర్పాట్లకు సంబంధించిన  సన్నాహాలను పరిశీలించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ వారణాసి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విశ్వనాథ ఆలయంలో బాబా భోలేనాథ్‌ను దర్శించుకున్నారు. అలాగే జ్ఞానవాపి నేలమాళిగలో విగ్రహాలను వీక్షించారు. ఈ సమయంలో ఆయన వెంట ఉన్నతాధికారులు ఉన్నారు. కాగా ఇటీవల కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి కాంప్లెక్స్‌లోని నేలమాళిగను పూజల కోసం తెరిచారు. అప్పటి నుంచి సామాన్య భక్తుల దర్శనాలు కూడా ప్రారంభమయ్యాయి. 

Videos

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)