Breaking News

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి

Published on Sat, 09/20/2025 - 01:40

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులకు మద్దతుగా నిలుస్తామని.. పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త నగరం ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’ని గొప్పగా నిర్మిస్తున్నామని తెలిపారు. భావితరాలకు అవకాశాలు సృష్టించడమే తమ ఆలోచన అన్నారు. దేశంలోనే కొత్త రాష్ట్రమైన తెలంగాణ, హైదరాబాద్‌కు గొప్ప చరిత్ర ఉందని చెప్పారు.

శుక్రవారం ఢిల్లీలోని హోటల్‌ తాజ్‌ ప్యాలెస్‌లో పబ్లిక్‌ ఎఫైర్స్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా (పీఏఎఫ్‌ఐ) 12వ వార్షిక సదస్సుకు రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది డిసెంబర్‌ 9న ఆవిష్కరించనున్న ‘తెలంగాణ రైజింగ్‌–2047’విజన్‌ డాక్యుమెంట్‌లో పొందుపరిచిన అంశాల గురించి సీఎం రేవంత్‌ పారిశ్రామికవేత్తలకు వివరించారు. అలాగే 30 వేల ఎకరాల్లో నిర్మించనున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ఉద్దేశాలతోపాటు ఇటీవల ఏర్పాటు చేసిన స్కిల్స్‌ యూనివర్సిటీ, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ గురించి తెలియజేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఏర్పాటు లక్ష్యాల గురించి వివరించారు. 

తెలంగాణలో ‘ట్రంప్‌’ను ప్రజలు పక్కనబెట్టారు... 
‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాలతో అమెరికాకే ఎక్కువగా నష్టం. ట్రంప్‌ ఒకరోజు ప్రధాని మోదీని స్నేహితునిగా అభివర్ణిస్తారు. మరో రోజు అడ్డగోలుగా సుంకాలు వేస్తారు. తెలంగాణలో ఒక ట్రంప్‌ (మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి) ఉండేవాడు. ఆయన్ను తెలంగాణ ప్రజలు పక్కనపెట్టారు. రాత్రి వచి్చన ఆలోచనను తెల్లారే అమలు చేయడం సాధ్యం కాదు’అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. 

న్యూజెర్సీ గవర్నర్‌తో భేటీ... 
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యూజెర్సీ గవర్నర్‌ ఫిలిప్‌ డి.మర్ఫీతో భేటీ అయ్యారు. విద్య, గ్రీన్‌ ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ (సినిమా రంగం), మౌలిక వసతులు (మెట్రో... పట్టణ రవాణా), మూసీ రివర్‌ ఫ్రంట్‌ తదితర అంశాల గురించి ఆయనకు తెలియజేశారు. తెలంగాణ రైజింగ్‌–2047 సాధనలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఐటీ, ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రాధాన్యాన్ని సీఎం తెలియజేశారు. న్యూజెర్సీ రైల్‌ అథారిటీ ద్వారా హైదరాబాద్‌ పట్టణ, ప్రజారవాణా రంగాలకు, తెలంగాణ రైజింగ్‌–2047 లక్ష్యానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని సీఎం రేవంత్‌కు మర్ఫీ హామీ ఇచ్చారు. 
దావోస్‌కు రావాలని సీఎంకు 

డబ్ల్యూఈఎఫ్‌ చీఫ్‌ ఆహా్వనం.. 
వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) అధ్యక్షుడు బోర్డ్‌ బ్రేండేతోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రైజింగ్‌–2047కు మద్దతిస్తామని సీఎంకు తెలియజేశారు. వచ్చే ఏడాది దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక 
సదస్సుకు విచ్చేయాలని రేవంత్‌ను ఆహా్వనించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసే విషయమై చర్చించేందుకు త్వరలో హైదరాబాద్‌కు వస్తానని హామీ ఇచ్చారు.

ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచి్చన అమెజాన్‌
అమెజాన్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ (పబ్లిక్‌ పాలసీ) చేతన్‌ కృష్ణస్వామితో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో మహిళా పారిశ్రామికవేత్తలు వారి ఉత్పత్తులను ‘కళాకార్‌’కార్యక్రమం కింద మార్కెటింగ్‌ చేసుకొనేందుకు ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా చేతన్‌ హామీ ఇచ్చారు. అలాగే హైదరాబాద్‌లో గిగ్‌ వర్కర్ల కోసం 100 విశ్రాంతి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. తెలంగాణకు చెందిన చిన్న, మధ్యతరహా సంస్థల విక్రయదారులు వారి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకొనే విషయంలో తోడ్పాటు అందిస్తామన్నారు. మరోవైపు గోద్రెజ్‌ సంస్థ ప్రతినిధులతోనూ సీఎం భేటీ అయ్యారు. ఈ భేటీలో జెర్సీ క్రీమ్‌ బ్రాండ్‌ కింద రూ. 200 కోట్లకుపైగా పెట్టుబడితో కొత్త డెయిరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు గోద్రెజ్‌ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)