Breaking News

బనకచర్లను అడ్డుకోండి

Published on Fri, 06/20/2025 - 02:31

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు ప్రీఫీజబిలిటీ నివేదికను తిరస్కరించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌–1980 (జీడబ్ల్యూడీటీ), ఏపీ పునర్విభజన చట్టం–2014లకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. 

ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో జల్‌శక్తి మంత్రి పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, ఇతర ఉన్నతాధికారులతో రేవంత్, ఉత్తమ్‌తోపాటు ఎంపీలు మల్లురవి, రఘువీర్‌ రెడ్డి, నీటి పారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ గురువారం సమావేశమయ్యారు. బనకచర్ల అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళన నెలకొందని వివరించారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెబుతోందని.. జీడబ్ల్యూడీటీ–1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదన్నారు. 

2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్ట్‌ నిర్మించాలనుకుంటే ముందు ఆ నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జల్‌శక్తి మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించి అనుమతి పొందాలని, అయితే బనకచర్ల విషయంలో ఏపీ వీటన్నింటిని ఉల్లంఘిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, జల్‌శక్తి శాఖ తక్షణమే జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్ట్‌ ముందుకెళ్లకుండా చూడాలని రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కోరారు.

వరద నిజమైతే ఇచ్చంపల్లి–సాగర్‌ అనుసంధానంపై చర్చిద్దాం
సీడబ్ల్యూసీ పరిధిలోని సాంకేతిక సలహా మండలి నుంచి అనుమతులు పొందకుండానే వరద జలాల పేరుతో పోలవరం కింద పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఏపీ చేపట్టిందని కేంద్ర మంత్రి పాటిల్‌కు రేవంత్, ఉత్తమ్‌ వివరించారు. గోదావరి అవార్డు ప్రకారం పోలవరం డిజైన్లు మార్పు చేసిందని, పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడుతోందని, తాము అభ్యంతరాలు లేవనెత్తినా పనులు కొనసాగిస్తూనే ఉందని చెప్పారు. 

గోదావరిలో వరద జలాలున్నాయని నిజంగా ఏపీ భావిస్తుంటే పోలవరం–బనకచర్లకు బదులు, కేంద్రం నిధులు ఇచ్చే ఇచ్చంపల్లి–నాగార్జున సాగర్‌ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్‌కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చకు తాము సిద్ధమని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాము ఎట్టిపరిస్థితుల్లో రాజీపడబోమని, అన్ని వేదికల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని తెలిపారు. కేంద్రం స్పందన సానుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీఎం స్పష్టం చేశారు.

1,500 టీఎంసీలను వాడుకునేలా..
» తెలంగాణకు గోదావరి నదిలో 1,000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు మొత్తంగా 1,500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జల్‌శక్తి శాఖ, ఏపీ నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేయాలని, దానికి కేంద్రం ఆమోదం తెలపాలని సీఆర్‌ పాటిల్‌కు రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. 1500 టీఎంసీల నీటితో కోటి న్నర ఎకరాలకు నీరు అందుతుందని, ఆ తర్వాత ఏపీ చేపట్టే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీ లిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.
»  ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు అనుమతు ల ప్రక్రియలో సత్వరం స్పందిస్తూ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శించడం తగదని సీఎం రేవంత్‌ అన్నారు. ఈ వైఖరితో ఇరు రాష్ట్రాల మధ్య అపోహలు, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయన్నా రు. పాలమూరు–రంగారెడ్డి, సమ్మక్క–సారక్క, తుమ్మిడి హెట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులతోపాటు అన్ని రకా ల అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కోరారు.
» గంగా, యమునా నదుల ప్రక్షాళనకు నిధులిచ్చినట్లే మూసీ పునరుజ్జీవానికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి పాటిల్‌కు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు