Breaking News

‘కావాలంటే కాళ్లు మొక్కుతా’.. ఇంజనీర్‌పై బిహార్‌ సీఎం అసహనం

Published on Wed, 07/10/2024 - 19:12

పట్నా: బిహార్‌లోని జేపీ గంగా బ్రిడ్జ్‌ పనులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ సహానం కోల్పోయారు. జేపీ గంగా ప్రాజెక్టు పురోగతికి  సంబంధించి ఇంజనీర్‌పై వేదికపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రాజెక్టు మొత్తం 12. 5 కిలోమిటర్ల  దూరం నిర్మించాల్సి ఉంది. అయితే ఇంకా  4. 5 కిలో మీటర్ల నిర్మాణం పెండింగ్‌లో ఉండటంతో ప్రాజెక్టు ఇంజనీర్‌పై సీఎం నితీష్‌ తీవ్ర అసహం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా ఇంజనీర్‌తో మాట్లాడుతూ..  ‘‘మీరు కావాలనుకుంటే.. మేము కాళ్లు మొక్కుతాం. తొందరగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయండి’’ అని చేతులు  జోడించి కోపంతో ఊగిపోయారు. దీంతో ‘‘సర్‌, మీరు దయ చేసి అలా మాట్లాడవద్దు’’ అని సదరు ఇంజనీర్‌ తిరిగి సీఎంకు చేతులు జోడించి వివరణ  ఇచ్చారు. దీంతో సీఎం నితీష్‌ శాంతించారు. ఈ కార్యకమ్రంలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, స్థానిక ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

 

ఇక.. ఇటీవల బిహార్‌లో పలు బ్రిడ్జ్‌లు, కాజ్‌వేలు కుప్పకూలడంతో సీఎం నితీష్‌ కుమార్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు  వెల్లువెత్తుతు​న్నాయి. ఈ క్రమంలో  15 మంది  ఇంజనీర్లపై బిహార్ ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటువేసింది. అనంతరం ప్రభుత్వం వరుస బ్రిడ్జ్‌లు కుప్పకూలటంపై   ప్రభుత్వం  దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 17 రోజుల్లో 10 బ్రిడ్జ్‌లు కూలిపోవడానికి ఇంజనీర్ల నిర్లక్ష్యం, సరిగా పర్వవేక్షించపోవటమే కారణమని దర్యాప్తు బృందం  నివేదిక ఇచ్చినట్లు బిహార్‌ జలవనరుల విభాగం అడిషినల్ చీఫ్‌ సెక్రటరీ చైతన్య ప్రసాద్‌ పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)