Breaking News

ఢిల్లీకి కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ కార్యాలయం సిద్ధం

Published on Mon, 12/12/2022 - 20:57

సాక్షి, న్యూఢిల్లీ: భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ఎల్లుండి (బుధవారం) తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. సర్దార్ పటేల్ మార్గంలోని అద్దె భవనంలో పార్టీ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో కార్యాలయం బయట భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

బుధవారం ఉదయం 9 గంటల నుంచి నవ చండీయాగాన్ని ప్రారంభించనున్నారు. ఈ చండీయాగం నిర్వహించేందుకు యాగశాలను నిర్మించి అందులో మూడు హోమ గుండాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నవ చండీయాగంలో సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. గురువారం మధ్యాహ్నం 12.37 నిమిషాల సమయంలో  పూర్ణాహుతిలో పాల్గొంటారని వాస్తు నిపుణులు తేజ వెల్లడించారు.

అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ వర్గాన్ని కూడా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. జాతీయ స్థాయిలో పార్టీ విధి విధానాలను కూడా కేసీఆర్ వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజా ప్రతినిధులు సుమారు 1500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. వీలును బట్టి భావసారుప్యత కలిగిన నాయకులు కూడా పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని సాదాసీదాగానే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు  పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చదవండి: ఎమ్మెల్యే టికెట్లపై తేల్చేసిన కేసీఆర్‌, తగ్గేదేలే! అంటున్న బొంతు?

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)