Breaking News

11 ఏళ్లుగా ‘ప్రగతిశీల భారత్‌’

Published on Tue, 06/10/2025 - 05:28

న్యూఢిల్లీ: దేశంలో ప్రజలకు సుపరిపాలన అందించడం, వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడంపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నామని, తమ మంత్రివర్గంలో 60 శాతం మంది ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలే ఉన్నారని గుర్తుచేశారు. మంత్రిమండలిలో ఆయా వర్గాలకు ఈస్థాయిలో అత్యధిక ప్రాతినిధ్యం దక్కడం ఇదే మొదటిసారి అని స్పష్టంచేశారు. 

కేంద్రంలో తమ ప్రభుత్వానికి 11 ఏళ్లు పూర్తికావడంతోపాటు మూడోసారి ప్రధానిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. నేడు మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే కాకుండా అంతర్జాతీయ వేదికలపై బలమైన గొంతుకగా నిలుస్తోందని ఉద్ఘాటించారు. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై మనం గళం వినిపిస్తున్నాయని చెప్పారు.

 140 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులు, వారి సమ్మిళిత భాగస్వామ్యంతో విభిన్న రంగాల్లో వేగవంతమైన మార్పునకు భారత్‌ సాక్షిగా నిలుస్తోందని హర్షం వ్యక్తంచేశారు. ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్‌’ స్ఫూర్తితో ఎన్డీయే ప్రభుత్వం ప్రజాసేవలో నిమగ్నమైందని వివరించారు. ‘ప్రజలే కేంద్రంగా ప్రగతి’ అనే విధానాన్ని అమలు చేస్తున్నామని, ఆర్థికాభివృద్ధితో సామాజిక మార్పునకు బాటలు వేస్తున్నామని స్పష్టంచేశారు.

 మన ఉమ్మడి విజయాలు మనందరికీ గర్వకారణమని, అదే సమయంలో ‘వికసిత్‌ భారత్‌’ నిర్మాణానికి మనమంతా నడుం బిగించాలని, కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆశ, ఆత్మవిశ్వాసం, నూతన సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. వేర్వేరు రంగాల్లో తమ ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకొచ్చిన మార్పులను ప్రధాని మోదీ ‘లెవెన్‌ ఇయర్స్‌ ఆఫ్‌ సేవ’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రభుత్వ పథకాలు, లబి్ధదారుల వివరాలు ఇందులో  పొందుపర్చారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)