Breaking News

జేఎన్‌యూ ఎన్నికల్లో  వామపక్షం క్లీన్‌ స్వీప్‌ 

Published on Fri, 11/07/2025 - 05:11

న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ఎన్నికల్లో వామపక్ష కూటమి తన ప్రాబల్యాన్ని నిలుపుకుంది. కీలకమైన నాలుగు పోస్టులనూ కైవసం చేసుకుంది. ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌(ఏఐఎస్‌ఏ), స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ), డెమోక్రాటిక్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌(డీఎస్‌ఎఫ్‌)ల కూటమి ఈ ఎన్నికల్లో క్యాంపస్‌పై తమ ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసుకున్నాయి. 

దాదాపు దశాబ్ద కాలం తర్వాత గత ఎన్నికల్లో జాయింట్‌ సెక్రటరీ పోస్టును దక్కించుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ ఏబీవీపీకి ఈ దఫా ఆ ఒక్క పోస్టు కూడా నిలుపుకోలేక పోవడం గమనార్హం.

 ఏఐఎస్‌ఏ తరఫున ప్రెసిడెంట్‌ పదవికి పోటీ పడిన అదితి మిశ్రా, ఏబీవీపీకి చెందిన వికాస్‌ పటేల్‌పై 449 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి కిఝాకూట్‌ గోపికా బాబు ఎన్నికయ్యారు. డీఎస్‌ఎఫ్‌ అభ్యర్థి సునీల్‌ యాదవ్, ఏఐఎస్‌ఏకు చెందిన డానిష్‌ అలీ జనరల్‌ సెక్రటరీ, జాయింట్‌ సెక్రటరీ పదవులకు ఎన్నికయ్యారు. మొత్తం అర్హులైన 9,043 మంది విద్యార్థులో 67 శాతం మంది ఓటేశారు. గతేడాది 70 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోవడం గమనార్హం.  

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)