Breaking News

చిన్నారిని గదిలో ఉంచి తాళం! 

Published on Sat, 08/23/2025 - 02:01

భువనేశ్వర్‌: ఒడిశాలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నిర్వాకమిది. బెంచీపై నిద్రిస్తున్న రెండో తరగతి చదివే ఎనిమిదేళ్ల చిన్నారిని అలాగే క్లాస్‌ రూంలో వదిలి, తాళమేసి ఇంటికి వెళ్లిపోయాడు. మెలకువ వచ్చాక ఆ చిన్నారి కేకలు వేసినా ఎవరికీ వినిపించలేదు. రాత్రంతా చీకట్లో, ఒంటరిగా అలాగే భయంభయంగా ఉండిపోయింది. చివరికి కిటికీలోంచి దూరి బయటకు వచ్చేందుకు శతథా ప్రయత్నించింది. వీలుకాక కిటికీ గ్రిల్‌లో తల ఇరుక్కుపోయింది. 

ఉదయం గ్రామస్తులు వచ్చి చూసే వరకు కొన్ని గంటలపాటు అలాగే వేదన అనుభవించింది. కియోంఝర్‌ జిల్లాలో అన్జార్‌లో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం ఘటన చోటుచేసుకుంది. రెండో తరగతి చదువుతున్న జోత్య్స దెహురి(8) అనే చిన్నారి తరగతి గదిలో ఓ బెంచీపై పడుకుని అలాగే నిద్రపోయింది. ఆమెను పట్టించుకోకుండా ఉపాధ్యాయుడు తరగతి గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. చిన్నారి చీకటిపడిన రాకపోయేసరికి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఊరంతా వెదికారు. శుక్రవారం ఉదయం ఆ స్కూలు వైపుగా వెళ్లిన గ్రామస్తులకు కిటికీ గ్రిల్‌లో తల ఇరుక్కుపోయిన స్థితిలో జోత్స్న రోదిస్తూ కనిపించింది. 

వెంటనే గ్రిల్స్‌ను తొలగించి, చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో స్కూలు ఇన్‌ఛార్జి హెడ్మాస్టర్‌ గౌరహరి మహంతాను అధికారులు సస్పెండ్‌ చేశారు. తరగతి గది కిటికీ గ్రిల్‌లో చిన్నారి తల ఇరుక్కున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. ఉపాధ్యాయుల వైఖరిపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, సాయంత్రం 4 గంటల తర్వాత తరగతి గదికి తాళాలు వేయాలంటూ 8వ తరగతి విద్యార్థులకు హెడ్మాస్టర్‌ చెప్పినట్లు విచారణలో తేలిందని డీఈవో వెల్లడించారు.  

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు