Breaking News

గణేష్ విగ్రహ నిమజ్జనంలో గలాటా

Published on Sun, 09/15/2024 - 11:25

లక్నో: యూపీలోని మహోబాలో గణేష్ విగ్రహం నిమజ్జనం సందర్భంగా గలాటా జరిగింది. ఒక ఇంటిపై బాణసంచా పడటంతో రెండు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. అది తోపులాటకు దారితీసింది. చూస్తుండగానే అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసు స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కసౌరాటోరి ప్రాంతంలో గణేష్ నిమజ్జనం కోసం రెండు విగ్రహాలు  ఊరేగింపుగా బయలుదేరాయి. ఇంతలో ఒక వర్గంవారు వెలిగించిన బాణసంచా  మరోవర్గం ఇంటిపై పడడంతో వివాదం చెలరేగింది. దీంతో ఇరువర్గాలకు చెందినవారు బకెట్లతో దాడి చేసుకోవడంతోపాటు, రాళ్లు రువ్వుకున్నారు. దీంతో  పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడివారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే ఇరువర్గాలవారు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ గణేష్ నిమజ్జనంలో భక్తులపై రాళ్లు రువ్విన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఇరువర్గాలను అతి కష్టంమీద శాంతింపజేసి, నిమజ్జనం సవ్యంగా జరిగేలా చూశారు. 
 

ఇది  కూడా చదవండి: గణేశ్‌ లడ్డూల తయారీలో జడేజా భార్య

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)