Breaking News

భోపాల్ గ్యాస్ బాధితుల ర్యాలీ : దిష్టిబొమ్మపై ఘర్షణ

Published on Wed, 12/03/2025 - 15:19

భోపాల్ గ్యాస్  దుర్ఘటన 41వ వార్షికోత్సవం సందర్బంగా బుధవారం జరిగిన  ర్యాలీ ఘర్షణకు దారితీసింది. ఈ ర్యాలీలో   ఉపయోగించిన దిష్టిబొమ్మపై ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) బీజేపీ(BJP) అభ్యంతరం వ్యక్తం  చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

భోపాల్‌లోని భారత్ టాకీస్ అండర్‌బ్రిడ్జి నుండి JP నగర్ గ్యాస్ వరకు మెమోరియల్ గ్యాస్ బాధితుల సంఘాలు వార్షిక సంస్మరణ ర్యాలీ  నిర్వహించాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, యూనియన్ కార్బైడ్ మరియు డౌ కెమికల్‌లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. అలాగే ప్రాణాలతో బయటపడిన వారికి సరైన పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశాయి. యూనియన్ కార్బైడ్, డౌ, 1984 విపత్తుతో సంబంధమున్నఇతర కంపెనీలను సూచించే దిష్టిబొమ్మలను  ర్యాలీలో ఉపయోగించారు. 

శాంతియుత ర్యాలీగా ప్రారంభమైన ర్యాలీ  తీవ్ర రాజకీయ ఘర్షణగా మారింది. దిష్టిబొమ్మపై ఆర్‌ఎస్‌ఎస్‌ అని రాశారని, నిర్వాహకులు మతపరమైన , సంస్థాగత భావాలను దెబ్బతీశారని ఆరోపిస్తే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో అక్కడి వాతావరణం మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకు పోలీసులు రంగప్రవేశం చేసి దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు గ్యాస్ బాధితుల సంఘాలు ఈ ఆరోపణలను తిరస్కరించాయి. తాము ఏ సంస్థనుద్దేశించిరాయలేదని, కేవలం డౌ కంపెనీ గురించి పేర్కొన్నామనీ స్పష్టం చేశారు. డౌ కెమికల్‌ను రక్షించడమే  బీజేపీ  ప్రభుత్వం లక్ష్యమని, దోషులైన కంపెనీలను  నిలదీసే ప్రయత్నాలను  బీజేపీ అడ్డుకుంటుందని ఆరోపించారు. విపత్తు సంభవించి 41 ఏళ్లు గడిచినా, బాధితులు ఇంకా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. యూనియన్ కార్బైడ్, డౌ కెమికల్, వాటి అనుబంధ సంస్థలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఖచ్చితమైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)