Breaking News

‘ఐ లవ్‌ మహ్మద్‌’ ర్యాలీ వివాదం 

Published on Sat, 09/27/2025 - 06:38

బరేలీ: ‘ఐ లవ్‌ మహ్మద్‌’కార్యక్రమానికి మద్దతుగా చేపట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ఇత్తెహాద్‌–ఇ–మిల్లత్‌ కౌన్సిల్‌ చీఫ్, మత పెద్ద తౌకీర్‌ రజా ఖాన్‌ చేసిన ప్రకటన యూపీలో బరేలీలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఒక మసీదు వెలుపల పెద్ద సంఖ్యలో గుమికూడిన జనం పోలీసులతో ఘర్షణకు దిగారు. ఇందుకు కారకులుగా గుర్తించిన డజను మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

 ఏదేమైనా ర్యాలీని నిర్వహిస్తామంటూ గురువారం ప్రకటించిన రజా ఖాన్‌.. అధికారులు అనుమతి ఇవ్వనందున ర్యాలీని రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రార్థనల అనంతరం ప్రకటించారు. దీంతో, ‘ఐ లవ్‌ మహ్మద్‌ అని రాసిన పోస్టర్లను చేబూనిన జనం పెద్ద సంఖ్యలో కొత్వాలీ ఏరియాలోని రజా ఖాన్‌ నివాసం, మసీదు వద్ద గుమికూడారు. 

ప్రదర్శనను వాయిదా వేయడంపై ఆగ్రహంతో ఇస్లామియా ఇంటర్‌ కాలేజీ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయతి్నంచగా అడ్డుకున్నాం. దీంతో రాళ్లు రువ్వుతూ, వాహనాలు, దుకాణాలపై దాడులకు పాల్పడ్డారు. వారిని చెదరగొట్టాం’అని పోలీసు అధికారులు తెలిపారు. పలువురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. విధ్వంసం సృష్టించేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇత్తెహాద్‌–ఇ–మిల్లత్‌ కౌన్సిల్‌ను అహ్మద్‌ రజా ఖాన్‌ ఏర్పాటు చేశారు. దక్షిణాసియాలో ఎక్కువ ప్రభావం కలిగిన సున్నీ ఇస్లాంలోని బెరేల్వీ వర్గాన్ని స్థాపించింది ఈయనే. ఈయన వారసుడే తౌకీర్‌ రజా ఖాన్‌. కాగా, ‘ఐ లవ్‌ మహ్మద్‌’నినాదంలో ఎలాంటి తప్పూ లేదని ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు.  
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)