Breaking News

నోటిమాట వినతులు చెల్లవు! 

Published on Tue, 11/25/2025 - 06:02

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ సూర్యకాంత్‌ సోమవారం తొలిరోజే తనదైన శైలిలో కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. అత్యవసరంగా విచారించాల్సిన కేసుల విషయంలో నూతన నిబంధన విధించారు. అర్జెంట్‌గా విచారణ చేపట్టాల్సిన కేసుల గురించి నోటిమాటగా విజ్ఞప్తి చేయడం ఆపాలని, ఇకపై లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. 

ఒక కాగితంపై కేసు వివరాలు రాసి ఇస్తే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిశితంగా పరిశీలిస్తుందని, తమ దృష్టికి తీసుకొస్తుందని అన్నారు. మరణ శిక్ష, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే నోటిమాటగా వచ్చే వినతులను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. అర్జెంట్‌ లిస్టింగ్‌ కేసుల విచారణలో న్యాయవాదులు ఈ నిబంధనకు కట్టుబడి ఉండాలని సూచించారు. సుప్రీంకోర్టులో అత్యవసర కేసుల గురించి న్యాయవాదులు నోటిమాటగానే సంబంధిత ధర్మాసనం దృష్టికి తీసుకురావడం చాలాఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. జస్టిస్‌ సూర్యకాంత్‌ సీజేఐ హోదాలో కేవలం రెండు గంటల వ్యవధిలో ఏకంగా 17 కేసులను విచారించారు.  

జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రస్థానం స్ఫూర్తిదాయకం  
ప్రమాణ స్వీకారం తర్వాత సుప్రీంకోర్టుకు చేరుకున్న జస్టిస్‌ సూర్యకాంత్‌ తొలుత మహాత్మాగాం«దీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద నివాళులర్పించారు. అనంతరం ఒకటో నంబర్‌ కోర్టుగదిలో త్రిసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహించి, కేసుల విచారణ ప్రారంభించారు. హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం, ప్రైవేట్‌ సంస్థకు మధ్య వివాదంలో తీర్పు వెలువరించారు. తర్వాత సుప్రీంకోర్టు  అడ్వొకేట్స్‌–ఆన్‌–రికార్డు అసోసియేషన్‌ అధ్యక్షుడు విపిన్‌ నాయర్‌.. జస్టిస్‌ సూర్యకాంత్‌కు సాదర స్వాగతం పలికారు. సాధారణ కుటుంబంలో జని్మంచి, సీజేఐ స్థాయికి చేరుకోవడం స్ఫూర్తిదాయకం అంటూ ఓ న్యాయవాది కొనియాడారు. ఆయనకు జస్టిస్‌ సూర్యకాంత్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.  

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)