Breaking News

న్యాయమూర్తి ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ కేసులో బిగ్‌ ట్విస్ట్‌

Published on Tue, 05/13/2025 - 09:47

ఢిల్లీ: హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో కాలిన నోట్ల కట్టల ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది

మార్చి 14న  జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక ఢిల్లీ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంపై సుప్రీంకోర్టు నియమించిన త్రి సభ్య కమిటీ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో  అగ్నిప్రమాదం జరిగిన ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున లభ్యమైన నోట్ల కట్టల్ని అక్కడ పనిచేసే సిబ్బంది  మాయం చేసినట్లు తెలుస్తోంది.  

వెలుగులోకి వచ్చిన నోట్ల కట్టలపై సుప్రీం కోర్టు త్రి సభ్య కమిటీ జస్టిస్ యశ్వంత్‌ వర్మను విచారించింది. విచారణలో నోట్ల కట్టల విలువపై స్పష్టత లేకపోవడం, అగ్నిప్రమాదం జరిగిన తర్వాత నోట్ల కట్టల్ని ఇంట్లో పనిచేసే సిబ్బంది మాయం చేయడం,నగదు వెలుగులోకి వచ్చిన గదికి తాళం వేసి ఉండడంతో, దాన్ని బలవంతంగా తెరవాల్సి రావడం వంటి అంశాలపై త్రి సభ్య  కమిటీ .. జస్టిస్‌ యశ్వంత్‌  వర్మను ప్రశ్నించింది. అయితే త్రి సభ్య కమిటీకి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలింది.

ఈ వరుస పరిణామాలపై త్రి సభ్య కమిటీ నివేదికను తయారు చేసి సుప్రీంకోర్టుకు అందించింది. ఆ నివేదికను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా..రాజీనామా చేసి తప్పుకోవడం ఉత్తమమని జస్టిస్‌ వర్మకు సూచించారు. అందుకు ప్రతిస్పందనగా తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని పేర్కొంటూ పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు.  

దీంతో జస్టిస్‌ వర్మ అభిశంసన (ఇంపీచ్‌మెంటు)కు సీజేఐ సంజీవ్‌ఖన్నా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై త్రి సభ్య కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు సీజేఐ పంపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)