Breaking News

డిజిటల్‌ యుగంలో బాలికల భద్రతకు ప్రమాదం

Published on Sun, 10/12/2025 - 06:05

న్యూఢిల్లీ: డిజిటల్‌ యుగంలో బాలికల భద్రత ప్రమాదంలో పడే పరిస్థితులు తలెత్తాయని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్‌ గవాయ్‌ శనివారం ఆందోళన వెలిబుచ్చారు. ఆన్‌లైన్‌ వేధింపులు, బెదిరింపులు, డీప్‌ఫేక్‌ వీడియోలు, వ్యక్తిగత డేటా దుర్వినియోగం వంటి సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

వీటి నియంత్రణకు ప్రత్యేక చట్టాల రూపకల్పన అవశ్యమని ఉద్ఘాటించారు. అలాగే విచారణా సంస్థలు, విధాన నిర్ణేతలకు ప్రత్యేక శిక్షణ అవసరమన్నారు. డిజిటల్‌ గవర్నెర్స్‌లో బాలికల రక్షణకు ప్రధాన ప్రాధాన్యత కల్పించాలని స్పష్టం చేశారు. యూనిసెఫ్‌ ఇండియాతో కలిసి జువెనైల్‌ జస్టిస్‌ కమిటీ (జేజేసీ) ఆధ్వర్యంలో ‘భారతదేశంలో బాలిక రక్షణ– సురక్షిత, ప్రోత్సహక వాతావరణం’ అనే అంశంపై ఇక్కడ జాతీయ వార్షిక భాగస్వామ్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో సీజేఐ చేసిన 

ప్రసంగంలో ముఖ్యాంశాలు... 
→ రాజ్యాంగపరమైన, చట్టపరమైన హామీలు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా అనేక మంది బాలికలు ఇప్పటికీ తమ మౌలిక హక్కులను, బతుకుదెరువు కోసం అవసరమైన ప్రాథమిక సదుపాయాలను దురదృష్టవశాత్తూ కోల్పోతున్నారు. ఈ బలహీన స్థితి వారిని లైంగిక వేధింపులు, దోపిడీలు, హానికరమైన ఆచారాల చక్రబంధంలోకి తోసేస్తోంది. పోషకాహార లోపం, లింగ ఆధారిత గర్భస్రావాలు, అక్రమ రవాణా, బాల్య వివాహాలు వంటి తీవ్రమైన సమస్యలను వారు ఎదుర్కొంటున్నారు.  
→ భద్రత అంటే కేవలం శరీరాన్ని రక్షించడం మాత్రమే కాదు.  ఇది మరెన్నో అంశాలతో మిళితమై ఉంటుంది. గౌరవంగా తలెత్తి నిలబడగల సమాజాన్ని నిర్మించడం,  అక్కడ ఆమె ఆశయాలు విద్యా సమానత్వంతో వికసించడం వంటి ఎన్నో అంశాలు ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. బాలికలకు, మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా కొన్నిచోట్ల కొనసాగుతున్న పితృస్వామ్య ఆచారాలను మనం ఎదుర్కొనాలి.  
→ రబీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించిన ‘భయములేని మనసు ఉన్న చోట’ అనే కవితలోని భావమే బాలిక రక్షణ లక్ష్యంగా ముందుకు సాగాలి.  
→ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అడ్డంకులు మహిళల జీవితాలకు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. కనుక వీటిపై లోతైన విశ్లేషణ అవసరం.  

‘చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ ది లా..’ పుస్తక పరిచయం 
జువెనైల్‌ జస్టిస్‌ కమిటీ  సభ్యులు న్యాయమూర్తి పార్దీవాలా ఈ సందర్భంగా  ‘చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ ది లా’ అనే  హ్యాండ్‌బుక్‌ను కార్యక్రమంలో ప్రవేశపెట్టారు.  ఈ పుస్తకం జేజేసీ మార్గదర్శకంలో సుప్రీంకోర్టు పరిశోధనా, ప్రణాళికా వ్యవహారాల విభాగం రూపొందించింది. జేజేసీ చైర్మన్‌ జస్టిస్‌ బి.వి. నాగరత్న, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి  వ్యవహారాల మంత్రి అయునిసెఫ్‌–ఇండియా దేశ ప్రతినిధి సిథి్నయా మక్కాఫ్రే తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)