Breaking News

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కీలక నిర్ణయం

Published on Thu, 04/03/2025 - 12:58

న్యూఢిల్లీ, సాక్షి: భారత ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీం కోర్టు న్యాయమూర్తులంతా కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ఆస్తులను ప్రకటించడానికి ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. తద్వారా జడ్జీలు ఆస్తులు వెల్లడించాల్సిందేననే సంకేతాలిచ్చారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆ వివరాలను సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసే జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక బంగ్లాలో నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఒకవైపు ప్రత్యేక కమిటీ విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు ఆ వివరాలను సర్వోన్నత న్యాయస్థానం వెబ్‌సైట్‌లో ఉంచి ఆశ్చర్యపరిచింది కూడా.

ఈ నేపథ్యంతో.. ఏప్రిల్‌ 1వ తేదీన సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలో న్యాయమూర్తులంతా ప్రత్యేక సమావేశం నిర్వహించుకున్నారు. తమ ఆస్తుల్ని బహిర్గతపరిచేందుకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా ఉన్న నిబంధనల ప్రకారం.. విధులు స్వీకరించే సమయంలో తమ ఆస్తుల వివరాలను న్యాయమూర్తులు చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియాకు తెలియజేయాల్సి వచ్చేది. ఆపై ఆ వివరాలను సుప్రీం కోర్టు తన వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేస్తూ వచ్చింది. కొంత మంది న్యాయమూర్తుల ఆస్తుల చిట్టా ఆ వెబ్‌సైట్‌లో ఉంది కూడా.

అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆ వివరాలేవీ అప్‌డేట్‌ కావడం లేదు. అందుకు కారణం.. ఆ వివరాలను తప్పనిసరిగా ప్రజలకు బహిర్గత పర్చాలనే నిబంధనేదీ లేకపోవడం లేకపోవడమే. ఈ క్రమంలో ఇప్పుడు జస్టిస్‌ వర్మ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో.. తమ ఆస్తుల్ని బహిర్గత పర్చాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తులంతా నిర్ణయించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)