Breaking News

స్టాలిన్‌కు మరో ఎదురుదెబ్బ.. డీఎంకేకు ఆ పార్టీ గుడ్‌బై

Published on Sat, 06/20/2026 - 21:17

తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) కూటమితో దాదాపు ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న సుదీర్ఘ రాజకీయ బంధానికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ) అధికారికంగా ముగింపు పలికింది. డీఎంకే నేతృత్వంలోని కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.

తమిళనాడులో టీవీకే గెలుపు ఆ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేశాయి. విజయ్‌ సీఎం కావడంతో అక్కడ పార్టీల పొత్తుల లెక్కలు మారుతున్నాయి. ఇదివరకే కాంగ్రెస్‌ పార్టీ డీఎంకేకు గుడ్‌బై చెప్పగా ఇప్పుడు ఆ జాబితాలో ఐయూఎంఎల్ నిలిచింది.

ఈ నిర్ణయంపై ఐయూఎంఎల్ జాతీయ అధ్యక్షుడు కేఎం కాదర్ మొహిదీన్ మాట్లాడుతూ "ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారాయి. ద్రవిడ మోడల్ పరిపాలన కొనసాగుతుందని మేము ఆశించాము, కానీ ప్రజల తీర్పు భిన్నంగా ఉంది. ఎన్నికల్లో టీవీకే పార్టీకి సంపూర్ణ మెజారిటీకి కొద్దిగా సీట్లు తగ్గినప్పుడు, రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వాన్ని కాపాడటానికి, రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాన్ని నివారించడానికి ఐయూఎంఎల్ మద్దతు ప్రకటించింది," అని ఆయన వివరించారు.

తాము డీఎంకే కూటమితో కలిసి దాదాపు 60 ఏళ్లు ప్రయాణించామని, ఈ కాలంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రతినిధుల రూపంలో తమ పార్టీకి ప్రాతినిధ్యం లభించిందని పేర్కొన్నారు. ఈమేరకు పార్టీ జనరల్ కౌన్సిల్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. డీఎంకేతో సంబంధాలను తెంచుకుంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. 

అలాగే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులపై తదుపరి దశలో నిర్ణయం తీసుకుంటామని పార్టీ స్పష్టం చేసింది. సాధారణంగా డీఎంకే వైపు మొగ్గు చూపే మైనారిటీ ఓటర్లు, ఈసారి టీవీకే వైపు మెుగ్గుచూపడం సైతం ఈ నిర్ణయానికి ఒక కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆరు దశాబ్ధాల బంధానికి తెర

డీఎంకే.. ఐయూఎంఎల్ బంధం ఇప్పటిది కాదు దాదాపు ఆరు దశాబ్ధాలుగా 1967 నుండి ఐయూఎంఎల్ పార్టీ డీఎంకే కూటమితో కలిసి నడుస్తోంది. డీఎంకేకు అత్యంత నమ్మకమైన, సన్నిహిత ముస్లిం మిత్రపక్షంగా ఈ పార్టీ గుర్తింపు పొందింది. మధ్యలో 1996, 2001 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఏఐఏడీఎంకే  కూటమి తరపున పోటీ చేసినప్పటికీ, డీఎంకేతో దీని రాజకీయ సంబంధాలు ఇన్నేళ్లుగా చెక్కుచెదరకుండా కొనసాగుతూ వచ్చాయి.

2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఐయూఎంఎల్ పార్టీ డీఎంకే కూటమిలో భాగంగా పోటీ చేసి రెండు స్థానాలను గెలుచుకుంది. అయితే, ఎన్నికల అనంతరం మారిన సమీకరణాల నేపథ్యంలో, ఆ పార్టీ టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి, అధికార కూటమిలో చేరింది. అంతేకాకుండా రాష్ట్ర మంత్రివర్గంలోనూ స్థానాన్ని దక్కించుకుంది.

కాగా ఇప్పటికే డీఎంకే కూటమి నుంచి పలు మిత్రపక్షాలు దూరమయ్యాయి. గతంలోనే కాంగ్రెస్, లెఫ్ట్ (కమ్యూనిస్ట్) పార్టీలు, విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) లు డీఎంకే కూటమి నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాయి. మరో మిత్రపక్షమైన మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK) కూడా కూటమిలో తన స్థానంపై పునరాలోచనలో ఉన్నట్లు సమాచారం.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)