China HMPV Virus: భారత్‌లో తొలి కేసు నమోదు.. ఎక్కడంటే?

Published on Mon, 01/06/2025 - 10:14

బెంగళూరు: భారత్‌లో చైనాకు చెందిన కొత్త వైరస్‌ హెచ్‌ఎంపీవీ వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. బెంగళూరుకు చెందిన ఎనిమిది నెలల చిన్నారిలో వైరస్‌ లక్షణాలు వైద్యులు గుర్తించారు. 

చైనా (China)లో హెచ్‌ఎంపీవీ (HMPV)వైరస్‌ కలకలం సృష్టిస్తోన్న వేళ భారత్‌లో తొలి పాజిటివ్‌ కేసు నమోదైంది. బెంగళూరులో ఎనిమిది నెలల చిన్నారిలో ఈ వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీనిపై కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. రాష్ట్రంలోని ల్యాబ్‌లో ఈ పరీక్ష నిర్వహించలేదని తెలిపింది. ఆ రిపోర్టు ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి వచ్చిందని, దానిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని వెల్లడించింది. అయితే దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి ధ్రువీకరణ రాలేదు.

ఏమిటీ హెచ్‌ఎంపీవీ?

  • హెచ్‌ఎంపీవీ ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు కరోనా, ఫ్లూ, ఇతర శ్వాసకోశ వ్యాధులను పోలి ఉంటాయి.
  • దగ్గు, జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి వంటివి ఉంటాయి.
  • వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీసే అవకాశం ఉంటుంది.
  • ఇన్‌ఫెక్షన్‌ సోకిన 3-6 రోజుల లోపు ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి.
  • ఇది ఎగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌. కొన్నిసార్లు దిగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ను కూడా కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
  • దీనివల్ల నిమోనియా, ఆస్థమా తీవ్రం అవుతాయని వివరిస్తున్నారు.
  • చిన్నారులు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇది తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉందని అంటున్నారు.
  • వ్యాప్తి ఇలా..
  • దగ్గు, తుమ్ము వల్ల వెలువడే తుంపర్లతో వ్యాప్తి చెందుతుంది.
  • వైరస్‌ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, కరచాలనం చేయడం వల్ల వ్యాపిస్తుంది.
  • వైరస్‌ వ్యాపించిన ప్రాంతాలను తాకిన చేతులతో నోరు, ముక్కు, కళ్లను తాకడం కారణం.

నివారణ ఇలా..

  • తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను కడుక్కోవాలి.
  • చేతులు శుభ్రం చేసుకోకుండా కళ్లు, ముక్కు, నోటిని తాకకూడదు.
  • ఇన్‌ఫెక్షన్‌ బారినపడిన వ్యక్తులకు దూరంగా ఉండాలి.
  • జలుబు లక్షణాలు ఉన్నవారు మాస్కు ధరించాలి.
  • దగ్గు, తుమ్ము వచ్చేప్పుడు నోరు, ముక్కును కవర్‌ చేసుకోవాలి.
  • వైరస్‌ సోకినవారు బయట తిరగకూడదు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)