Breaking News

గాలి తగిలితే వణుకు, నీటిని చూస్తే భయం.. రేబిస్‌తో 14 ఏళ్ల బాలుడు మృతి!

Published on Wed, 09/06/2023 - 07:13

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో రేబిస్‌తో 14 ఏళ్ల బాలుడు హృదయవిదారక స్థితిలో కన్నుమూశాడు. నాలుగు రోజుల క్రితం బాలునిలో రేబిస్‌ లక్షణాలు కనిపించాయి. గాలికి, నీటికి భయపడటంతో పాటు చీకటిలో ఉండేందుకు ఇష్టపడసాగాడు. పిల్లాడి విచిత్ర ప్రవర్తన, అనారోగ్య పరిస్థితులను గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. 

ఈ ఉదంతం విజయ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చరణ్‌సింగ్‌ కాలనీలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన యూకూబ్‌ పెద్ద కుమారుడు సాబేజ్‌ను నెల రోజుల క్రితం కుక్క కరిచింది. భయం కారణంగా సాబేజ్‌ ఈ విషయాన్ని ఇంటిలోని వారికి చెప్పలేదు. అయితే నాలుగు రోజుల క్రితం ఆ కుర్రాడిలో రేబిస్‌ లక్షణాలు బయటపడ్డాయి. మొదట్లో ఇంటిలోని వారికి ఏమీ అర్థం కాలేదు. అయితే రానురాను సాబేజ్‌ ఆరోగ్యం క్షీణించసాగింది. 

పిల్లాడి ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు సాబేజ్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యపరీక్షలు చేసిన అనంతరం వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. వైద్యం అందని స్థితిలో సాబేజ్‌ హృదయవిదారక స్థితిలో కన్నుమూశాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుమారునిడి చికిత్స కోసం ఘాజియాబాద్‌లోని ఎంశ్రీం ఆసుపత్రితో పాటు మీరఠ్‌, ఢిల్లీలోని జీటీబీ, ఎయిమ్స్‌ ఆసుపత్రులకు చికిత్స కోసం తీసుకువెళ్లామన్నారు. అయినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సాబేస్‌ను పొరుగింటిలోని వారి కుక్క కరిచింది. ఒక మహిళ ఆ కుక్కను సంరక్షిస్తోంది. అలాగే ఆమె వీధి కుక్కలను ఆహారం కూడా అందిస్తుంటుంది. దీంతో ఐదారు కుక్కలు ఆమె ఇంటి వద్దనే ఉంటాయి. ఆ మహిళ పెంచుకుంటున్న కుక్క కరవడంతోనే తమ కుమారుడు మరణించాడని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లాడికి జరిగిన విధంగా ఎవరికీ జరగకూడదని వారు అంటున్నారు. ఈ ఉదంతం నేపద్యంలో నగరపాలక అధికారులు ఆ కుక్కను పెంచుకుంటున్న మహిళకు నోటీసు అందజేశారు. తదుపరి చర్యలకు ఉపక్రమించారు.  
ఇది కూడా చదవండి: విద్యాదానం వీరి జీవన విధానం!

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)