Breaking News

పామును కొరికి చంపిన పిల్లాడు

Published on Sun, 07/27/2025 - 06:52

పట్నా: బతికే రాత ఉంటే ఆకాశం నుంచి పడినా ఏమీ కాదని కొందరంటారు. విషం చిమ్మే తాచుపామును కొరికి కూడా ఏడాది వయసు పిల్లాడు బతికి బట్టకట్టిన అరుదైన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. బొమ్మ అనుకుని పామును పట్టుకోవడం, అది చేతికి చుట్టుకోవడం, తర్వాత దానిని నోటితో కొరికి చంపడం, స్వల్ప విష ప్రభావంతో పిల్లాడు ఆస్పత్రిపాలై చివరకు ప్రాణాలతో బయటపడటం అంతా నమ్మశక్యంకాని రీతిలో జరిగాయి. 

ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం వెస్ట్‌చంపారన్‌ జిల్లాలోని మొహఛీ బంకాత్వా గ్రామంలో గోవింద్‌ కుమార్‌ అనే ఏడాది వయసు పిల్లాడిని తల్లి ఇంటి వరండాలో వదిలేసి సమీపంలో వంటచెరకు సేకరిస్తోంది. అదే సమయంలో పిల్లాడి వైపు ఒక తాచుపాము వచ్చింది. దీనిని బొమ్మగా భావించిన పిల్లాడు పక్కన ఉన్న వస్తువుతో కొట్టాడు. దాంతో అది పిల్లాడి అరచేతికి చుట్టుకుంది. మెత్తగా ఉండటంతో పిల్లాడు అదేదో తినే వస్తువును అనుకుని వెంటనే నోట్లో పెట్టుకుని పరపరా నమిలేశాడు. దీంతో పాము సెకన్లలో చనిపోయింది. అదే సమయానికి అటుగా వచ్చిన పిల్లాడి అమ్మమ్మ మాతేశ్వరీ దేవి .. పిల్లాడి చేతిలో పామును చూసి హుతాశురాలైంది. వెంటనే పిల్లాడిని, పామును వేరుచేసింది. అయితే అప్పుడు హుషారుగా కనిపించిన పిల్లాడు సమయం గడిచేకొద్దీ నీరసించిపోయాడు. 

తర్వాత స్పృహకోల్పోయాడు. విషయం తెల్సుకుని పరుగున వచ్చిన పిల్లాడి తల్లి, కుటుంబసభ్యులు వెంటనే పిల్లాడిని దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చేరి్పంచారు. అయితే పిల్లాడి పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే బేఠియా పట్టణంలోని ప్రభుత్వ వైద్య బోధనాస్పత్రికి తరలించారు. హుటాహుటిన పిల్లాడికి అత్యయిక వైద్యం మొదలెట్టి పిల్లాడి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం పిల్లాడు కోలుకుంటున్నాడని, పాము అతడిని కాటువేయలేదని, నోట్లో పెట్టుకుని కొరకడం వల్ల విషం కొంత పాకి నోట్లోకి వెళ్లి ఉంటుందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దువాకాంత్‌ మిశ్రా చెప్పారు.    

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)