Breaking News

రూ. 450తో వ్యాపారం.. నెలల వ్యవధిలో రోజుకు రెండు వేల ఆదాయం!

Published on Tue, 03/12/2024 - 08:46

దేశంలోని చాలామంది రైతులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ రకాల వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రైతులు ఆవులు, గేదెల పెంపకాన్ని వదిలి కోళ్ల పెంపకంవైపు దృష్టి సారిస్తున్నారు. ఇది వారికి లాభదాయకమైన వ్యాపారంగా మారుతోంది. 

ప్రస్తుతం దేశీ కోడి మాంసానికి మార్కెట్‌లో డిమాండ్‌ పెరగడంతో చిన్న, సన్నకారు పశుపోషకులు  కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లా భగవాన్‌పూర్ బ్లాక్‌కు చెందిన ముఖేష్ పాశ్వాన్ భార్య సంగీతా దేవి గతంలో గేదెలను పోషిస్తూ ఆదాయాన్ని ఆ‍ర్జించేవారు. దీనిలో అంతగా లాభాలు లేకపోవడంతో ఆమె దేశవాళీ కోళ్లను వాణిజ్యపరంగా పెంచడం ప్రారంభించారు. 

బీహార్‌ ప్రభుత్వం అందించే జీవిక ఐపీడీఎస్ థర్డ్ ఫేజ్ పథకం కింద రూ.450 వెచ్చించి, 25 దేశీకోళ్లను కొనుగోలు చేసి వాటి పెంపకాన్ని చేపట్టినట్లు సంగీత మీడియాకు తెలిపారు. ఆమె దేశవాళీ కోళ్లతో పాటు కడక్‌నాథ్, సోనాలి, ఎఫ్‌ఎఫ్‌జీ జాతుల కోళ్లను కూడా పెంచసాగారు. కోడి మాంసంతో పాటు గుడ్లు, కోడిపిల్లలను సిద్ధం చేయడం ద్వారా ఆమె వ్యాపారాన్ని మరింత వృద్ధి చేశారు. ఇప్పుడు గ్రామానికి  చెందిన పలువురు మహిళలు  సంగీత దగ్గర దేశీ కోళ్ల పెంపకంలో మెళకువలు నేర్చుకునేందుకు వస్తున్నారు. 

25 కోళ్లతో వ్యాపారం ప్రారంభించిన ఆమె దగ్గర ప్రస్తుతం 100 కోళ్లు ఉన్నాయి. స్థానికంగా కోడి గుడ్డు ధర మార్కెట్‌లో రూ.20 వరకూ ఉంది. ప్రస్తుతం ఆమె పెంచుతున్న కోళ్ల నుంచి ప్రతిరోజూ రూ. 200 విలువైన గుడ్లు వస్తున్నాయి. అలాగే రోజుకు నాలుగు నుంచి ఐదు కిలోల కోడి మాంసం సిద్ధమవుతోంది. వీటిని విక్రయిస్తూ ఆమె రోజుకు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ఆదాయాన్ని అందుకుంటోంది.

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)