ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 11 మంది జవాన్లు మృతి..

Published on Wed, 04/26/2023 - 15:28

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లా అరాన్‌పుర్‌ సమీపంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జవాన్లతో వెళ్తున్న మినీ బస్సును టార్గెట్ చేసి ఐఈడీ పేల్చారు.  ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా డిస్ట్రిక్ట్ రిజర్వుడు గార్డు(డీఆర్‌డీ)కు చెందినవారు.

మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో అడవిలో కూంబింగ్‌ నిర్వహించేందుకు జవాన్లు వెళ్తుండగా.. వీరి రాకను పసిగట్టి మావోయిస్టులు దాడి చేశారు. మినీ బస్సును లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేల్చారు.

అమరులైన జవాన్ల పేర్లు
 1. రామ్‌కుమార్ యాదవ్ - హెడ్ కానిస్టేబుల్
 2. టికేశ్వర్ ధ్రువ్ - అసిస్టెంట్ కానిస్టేబుల్ CAF, ధమ్తరి
 3. సలిక్ రామ్ సిన్హా - కానిస్టేబుల్, కంకేర్
 4. విక్రమ్ యాదవ్, హెడ్ కానిస్టేబుల్
 5. రాజేష్ సింగ్ - కానిస్టేబుల్ (ఘాజీపూర్, యుపి)
 6. రవి పటేల్ - కానిస్టేబుల్
7. అర్జున్ రాజ్‌భర్, కానిస్టేబుల్ (CAF)

సీఎంకు అమిత్‌షా ఫోన్..
ఈ ఘటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ఛత్తీస్‌గఢ్ సీఎం బూపేశ్‌ బఘేల్‌కు ఫోన్ చేశారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

జవాన్లు ప్రాణాలను బలిగొంటున్న మావోయిస్టులను వదిలిపెట్టబోమని సీఎం బఘేల్ తేల్చిచెప్పారు. పోరాటం చివరి దశలో ఉందని పేర్కొన్నారు. ఘటనలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

ములుగు పోలీసులు అప్రమత్తం..
ఛత్తీస్‌గఢ్‌ ఘటనతో తెలంగాణలోని ములుగు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ కెమెరాలతో ఏజెన్సీని జల్లెడ పడుతున్నారు. వెంకటాపురం-భద్రాచలం ప్రధాన రహదారిపై మావోయిస్ పార్టీ అగ్ర నేతల వాల్ పోస్టర్లతో వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీలో మావోయిస్టు యాక్షన్ టీం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
చదవండి: భార్యను సమాధి చేసి దానిపై డ్యాన్సులు.. ఈ కేసు ఆధారంగా వెబ్‌ సిరీస్‌.. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)