Breaking News

శివాజీ జయంతి: చిన్న లక్ష్యంతో మొదలుపెట్టి..

Published on Wed, 02/19/2025 - 12:06

నేడు(బుధవారం, ఫిబ్రవరి 19) మరాఠా సామ్రాజ్య వీరుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి. 1630, ఫిబ్రవరి 19న శివాజీ జన్మించారు. మొఘలుల బారి నుండి  భారతదేశాన్ని కాపాడటంలో శివాజీ మహరాజ్‌ విజయాన్ని సాధించారు. ఆయన  ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచారు. ఆనాడు శివాజీ మహారాజ్ చెప్పిన స్ఫూర్తిదాయకమైన మాటలు నేటికీ అందరికీ ఉపయుక్తమవుతున్నాయి.  

1. చిన్న లక్ష్యంతో మొదలుపెట్టి.. 
ఛత్రపతి శివాజీ మహారాజ్ తెలిపినదాని ప్రకారం ఒక చిన్న లక్ష్యం దిశగా వేసే  ప్రతి అడుగు.. ఆ తరువాత పెద్ద లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది. దీని అర్థం పెద్ద లక్ష్యాలను సాధించే ముందు చిన్న లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించాలి.

2. శత్రువు బలహీనుడే..
ఎవరైనా సరే శత్రువును బలహీనుడిగా పరిగణించాలని, అందుకు విరుద్దంగా చాలా బలవంతుడిగా భావించి, భయాందోళనలకు లోనుకావద్దని చెప్పేవారు. ఎవరికైనా జీవితంలో  కఠినమైన సవాలు  ఎదురైనప్పుడు, అది వారిపై ఆధిపత్యం చెలాయించేలా చేసుకోకూడదన్నారు.

3. అంకితభావంతో..
కాలచక్రంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు కూడా  మనిషి అంకితభావంతో పనిచేయాలని, అప్పుడు కాలమే అతనికి అనుగుణంగా మారుతుందని ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్పేవారు. ఎవరైనాసరే లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడి పనిచేయాలన్నారు.

4. పరిణామాల గురించి..
ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ముందుగా దాని పరిణామాల గురించి ఆలోచించాలని శివాజీ సూచించేవారు. ఇలా చేయడం ఎంతో ప్రయోజనకరమని, అప్పుడే భవిష్యత్ తరాలు కూడా మనల్ని అనుసరిస్తాయనేవారు.

5. పర్వతారోహణ కూడా చిన్నదే..
ధైర్యసాహసాలకు ప్రసిద్ధి చెందిన మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ ఒకసారి మాట్లాడుతూ.. లక్ష్యం ఉన్నతంగా ఉన్నప్పుడు పర్వతారోహణ కూడా చిన్నదిగా కనిపిస్తుందని అన్నారు. అంటే ఎవరైనా సరే లక్ష్యాలను సాధించాలనే దృఢ సంకల్పంతో  ముందుకు సాగితే, అత్యంత క్లిష్ట పరిస్థితులు కూడా తేలికగా అనిపిస్తాయి.

6. గెలవడమే లక్ష్యం
ఎవరికైనా గెలవడమే లక్ష్యం అయినప్పుడు, దానిని సాధించేందుకు ఎంతటి కష్టానికైనా సిద్ధపడాల్సిందేనని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ చెప్పేవారు.

ఇది కూడా చదవండి: పంజాబ్‌ సీఎంగా కేజ్రీవాల్‌?.. భగవంత్‌ మాన్‌ క్లారిటీ
 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు