Breaking News

మోదీ కోసం ఛావా స్పెషల్‌ స్క్రీనింగ్‌

Published on Tue, 03/25/2025 - 12:50

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఛావా’’(Chhaava)ను ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించబోతున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎంపీల కోసం పార్లమెంట్‌లోనే ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు.

మార్చి 27న పార్లమెంట్‌లోని బాలయోగి ఆడిటోరియంలో ఛావా సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ స్క్రీనింగ్‌కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ ఎంపీలు, ఇత‌ర ముఖ్య నాయ‌కులు హాజ‌రుకాబోతున్న‌ట్లు స‌మాచారం. చిత్ర దర్శకుడితో పాటు తారాగణం కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని న్యూస్‌18 తన కథనంలో పేర్కొంది. 

బాలీవుడ్ న‌టుడు విక్కీ కౌశల్ నటించిన చిత్రమే ‘ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు (Chhatrapati Shivaji Maharaj) శంభాజీ మహారాజ్(Sambhaji Maharaj) జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌గా.. దినేష్ విజన్ నిర్మించారు. ర‌ష్మిక మంద‌న్నా, అక్షయ్‌ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 14న విడుదలై సూప‌ర్ హిట్ అందుకోవ‌డ‌మే కాకుండా.. కేవ‌లం హిందీలోనే రూ.750 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. రీసెంట్‌గా ఈ సినిమాను తెలుగులో కూడా విడుద‌ల చేయ‌గా.. భారీ వ‌సుళ్ల‌ను సాధించింది. 

ఛావా సక్సెస్‌పై గతంలోనే ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనానికి హాజరై ఆయన.. ప్రస్తుతం దేశంలో ఛావా హవా కొనసాగుతోందంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఛావా చిత్రానికి స్ఫూర్తినిచ్చిన నవల(ఛావా) రచయిత శివాజీ సావంత్‌కు ఈ ఘనతంతా దక్కుతుందని అభినందించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)