Breaking News

23 ఏళ్లుగా సైకిల్‌ పైనే విధులకు.. ఆదర్శంగా నిలుస్తున్న మహిళా ఎస్సై

Published on Tue, 01/31/2023 - 19:03

సాక్షి, చెన్నై: చిరు ఉద్యోగులే బైక్‌లు, కార్లు వినియోగిస్తున్న ఈ రోజుల్లో ఓ పోలీస్‌ అధికారిణి గత 23 ఏళ్లుగా సైకిల్‌ పైనే విధులకు హాజరవుతుండడం కచ్చితంగా విశేషమే. వివరాలు.. చెన్నై షావుకారుపేటలోని ఫ్లవర్‌ బజార్‌ పోలీసు స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న 45 ఏళ్ల జి.పుష్పరాణి రోజూ సైకిల్‌ పైనే డ్యూటీకి వెళ్తారు. అలాగేే తన ఇంటి పనులకు సైతం దాన్నే వాడుతారు.

1997లో ఈమె తమిళనాడు స్పెషల్‌ పోలీసు విభాగంలో గ్రేడ్‌– 1 కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత పదోన్నతి ద్వారా పుదుపేట ఆర్మ్‌డ్‌ రిజర్వుకు బదిలీ అయ్యారు. విశ్రాంత ఎస్‌ఐ అయిన తన తండ్రి గోవింద స్వామి సైకిల్‌ పైనే విధులకు వేళ్లేవారని ఆమె పేర్కొన్నారు. తండ్రి స్ఫూర్తితో దాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ఏడో సైకిల్‌ చెన్నై సిటీ పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ బహుమతిగా ఇచ్చారని వెల్లడించారు.

ఎవరినీ సైకిల్‌ తొక్కమని బలవంతం చేయనని, అలాగే తనను సైకిల్‌ నుంచి ఎవరూ దూరం చేయలేరని పుష్పరాణి స్పష్టం చేశారు. తన ఇద్దరు పిల్లలను మాత్రం ఆరోగ్య సంరక్షణ కోసం సైకిల్‌ పైనే పాఠశాలకు వేళ్లేలా ప్రేరేపిస్తున్నట్లు చెప్పారు. ధనవంతులకు సైకిల్‌ వ్యాయామం అయితే.. పేదలకు అది జీవనాధారం అని ఆమె తెలిపారు.  ఫ్లవర్‌ బజార్‌ పోలీసు స్టేషన్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ డి. ఇంద్ర మాట్లాడుతూ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పుష్పారాణి ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారని కొనియాడారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)