Breaking News

పని ఒత్తిడితో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య!

Published on Sun, 09/22/2024 - 12:12

చెన్నై:  ఇటీవల ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాకు చెందిన 26 ఏళ్ల ఉద్యోగిని పని ఒత్తిడితో మృతిచెందిన ఘటన మరవక ముందే మరొకటి వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్న 38 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చెన్నైలోని తన ఇంట్లో ఆత్మహత్యకు చేసుకున్నాడు. పని ఒత్తిడి కారణంగానే తన భర్త  ఆత్మ హత్య చేసుకొని ఉంటాడని అతని భార్య  అనుమానం వ్యక్తం చేసినట్లు పోలిసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన కార్తికేయన్ తన భార్య, ఇద్దరు పిల్లలతో చెన్నైలో నివసిస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో కార్తికేయ టెక్కీగా పని చేస్తున్నారు. ఇక.. కార్తికేయ తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడుతున్నారు. రెండు నెలలుగా ఆయన డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్నాడు.

ఘటన సమయంలో కార్తికేయ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. సోమవారం ఆయన భార్య కె జయరాణి.. పిల్లలను తన తల్లి వద్దకు దింపి, చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలోని తిరునల్లూరు ఆలయానికి వెళ్లారు. గురువారం రాత్రి తిరిగి వచ్చి తలుపు కొట్టగా.. ఇంట్లో నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇంట్లోకి ప్రవేశించడానికి స్పేర్ కీని ఉపయోగించి లోపలికి వెళ్లగా.. కార్తికేయ కరెంట్‌ తీగకు చుట్టుకొని విగతజీవిగా పడిఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదికూడా చదవండి:  పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం

 

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)