Breaking News

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. వారంలో రెండో ఘటన

Published on Sat, 06/01/2024 - 11:38

ముంబై: దేశంలో బాంబు బెదిరింపు కాల్స్‌ కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నగరాల్లోని  పాఠశాలలు, ఆసుపత్రులు, జైళ్లు, ప్రముఖులు నివాసాలు,. విమానాశ్రయాలు.. ఇలా ప్రతిచోటా బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా విమానంలో కూడా బాంబు బెదిరింపులు అందాయి.

ఇండిగో విమానానికి శనివారం ఉదయం బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. చెన్నై నుంచి  172 మంది ప్రయాణికులతో ముంబై వెళుతున్న 6E 5314 ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు రావడంతో.. అప్రమత్తమైన అధికారులు ముంబైలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. విమానంలో నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించారు. ప్రోటోకాల్‌  ప్రకారం విమానాన్ని ఐసోలేషన్‌ బే కు తరలించి విమానాన్ని తనిఖీ చేస్తున్నారు.  

‘ప్రయాణికులందరిని సురక్షితంగా విమానం నుంచి  ఖాళీ చేయించాం. ప్రస్తుతం విమానం తనిఖీలో ఉంది. అన్ని భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత, విమానం టెర్మినల్ ప్రాంతంలో తిరిగి ఉంచుతాం’ అని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.

కాగా వారం రోజుల వ్యవధిలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం ఇదే రెండోసారి. మే 28న ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.  ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం ఉదయం 5 గంటలకు బయలుదేరాల్సి ఉండగా.. టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో బాత్రూమ్‌లో ఓ టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ అని రాసి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా దించేసి.. ఎయిర్‌పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన బాంబు స్వ్కాడ్‌ సిబ్బంది.. విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. నకిలీ బెదిరింపులని గుర్తించారు.


 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?