Breaking News

ఇంట్లో ఒంటరిగా ఉన్న కోడలిపై మామ దుర్మార్గం..!

Published on Thu, 07/02/2026 - 09:59

సాక్షి,చెన్నై: చెన్నై శివారులోని పల్లావరం అనకాపుత్తూరులో లైంగిక వేధింపునకు గురిచేస్తున్న మామను, ఆగ్రహానికి గురైన కోడలు కాయగూరలు నరికే కత్తితో గొంతుపై పొడిచి చంపేసింది. బుధవారం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. 

పోలీసుల కథనం మేరకు తమిళనాడులోని అనకాపుత్తూరు ప్రాంతానికి చెందిన ఇలం పెరుమాళ్‌ కుమారుడు మణికండన్‌కు పదేళ్ల క్రితం మీనా (38)తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు నెలల క్రితం మణికండన్‌ హఠాత్తుగా మరణించడంతో, భార్య మీనా తన పిల్లలతో కలిసి అత్తమామల ఇంట్లోనే ఉంటోంది. భర్త మరణించిన నాటి నుండి మీనా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

ఒంటరిగా ఉన్న సమయం చూసి.. 
రెండు రోజుల క్రితం మణికండన్‌ తల్లి (మీనా అత్త) కాంచీపురంలోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. దీంతో ఇంట్లో మామ ఇలపెరుమాళ్, కోడలు మీనా  పిల్లలు మాత్రమే ఉన్నారు. తన భార్య  ఊరెళ్లినన్పటి నుంచి ఇలం పెరుమాల్‌లోని కామాంధుడు బయటకు వచ్చారు. మద్యం సేవిస్తూ కోడలిపై కన్నేశాడు. మంగళవారం రాత్రి మద్యం మత్తులో వచ్చిన ఇలం పెరుమాల్‌ తన కోడలు మీనా గదిలోకి ప్రవేశించి, ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. మామ ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి, ఆవేదనకు గురైన మీనా.. తనను తాను రక్షించుకునే క్రమంలో ఇంట్లో ఉన్న కాయగూరలు కట్‌ చేసేందుకు ఉపయోగించే కత్తిని తీసుకుని ఇలంపెరుమాళ్‌ మెడపై బలంగా పొడిచింది. కత్తిపోటు తీవ్రంగా తగలడంతో ఇలపెరుమాళ్‌ రక్తపు మడుగులో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే.. శంకర్‌ నగర్‌ పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి