Breaking News

మరికొన్ని గంటల్లో చంద్రుని ఉపరితలంపైకి.. చంద్రయాన్‌-3ని హాలీవుడ్‌ మూవీతో పోలుస్తూ..

Published on Tue, 08/22/2023 - 13:16

మన దేశమంతా ఆగస్టు 23 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదేరోజు చంద్రయాన్‌-3 చంద్రుని ఉపరితంపై ల్యాండ్‌ కానుంది. చంద్రయాన్-3 ఆర్థిక బడ్జెట్ 615 కోట్ల రూపాయలు(75 మిలియన్ డాలర్లు) 2023, జూలై 14న చంద్రయాన్‌-3 లాంచ్ బటన్‌ను నొక్కారు. అప్పటి నుండి చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలంపైకి ఎప్పుడు ల్యాండ్ అవుతుందా అని భారతదేశమంతా ఎదురుచూస్తోంది. 

పలువురు నెటిజన్లు చంద్రయాన్-3 బడ్జెట్‌ను కొన్ని హాలీవుడ్ సినిమాల బడ్జెట్‌తో పోలుస్తున్నారు. 2009లో విడుదలైన హాలీవుడ్ చిత్రం అవతార్ బడ్జెట్ దాదాపు రూ.1970 కోట్లు. చంద్రయాన్-3 మొత్తం బడ్జెట్ రూ.615 కోట్లు. అంటే అవతార్ సినిమా ఖర్చులోని మూడో వంతు మొత్తంతో చంద్రయాన్-3ని చంద్రునిపైకి పంపడంలో భారత్ విజయం సాధించిందని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. 

అలాగే హాలీవుడ్‌ సినిమా ఇంటర్‌స్టెల్లర్‌కు 165 మిలియన్ల డాలర్లు ఖర్చుకాగా, చంద్రయాన్‌ 75 మిలియన్‌ డాలర్లతోనే విజయం సాధించిందని అంటున్నారు. రూ. 615 కోట్లు అంటే భారత్‌కు భారీ మొత్తమేనని పలువురు పేర్కొంటున్నారు. ఇది శాస్త్రవేత్తలు సాధించిన ఘన విజయం అని కొందరు, వారి నాలుగేళ్ల శ్రమ వృథాగా పోలేదని మరికొందరు అంటున్నారు. శాస్త్రవేత్తల కృషికి సెల్యూట్‌ అని, శాస్త్రపరిశోధనలకు భారతదేశం మరింతగా ఖర్చు చేయాలని యూజర్లు సలహా ఇస్తున్నారు.  

కొందరు యూజర్లు చంద్రయాన్‌-3 ప్రాజెక్టును సినిమాల నిర్మాణ వ్యయంతో పోల్చడం సరికాదని అన్నారు. భారతీయులు వ్యయ నియంత్రణతో ఈ ప్రాజెక్టు చేపట్టారని, చంద్రయాన్‌ ప్రయోగం ‍ప్రతీ భారతీయునికి గర్వకారణమని మరికొందరు అంటున్నారు. 
ఇది కూడా చదవండి: అది రహస్య కుటుంబం.. 40 ఏళ్లుగా దట్టమైన అడవుల్లోనే ఉంటూ..
 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)