Breaking News

జూలై 1 నుంచి ‘భారత’ చట్టాలు

Published on Sun, 02/25/2024 - 05:34

న్యూఢిల్లీ: వలసపాలన నాటి నేర న్యాయ వ్యవస్థ చట్టాలను సంస్కరించి నేటి ఆధునిక సమాజ అవసరాలకు తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా చట్టాలు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. హిట్‌ అండ్‌ రన్‌ కేసులకు సంబంధించిన నిబంధనలు మాత్రం ఇప్పుడే అమలుకావు.

హిట్‌ అండ్‌ రన్‌ కేసులపై ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్తంగా కొద్దివారాల క్రితం ధర్నాకు దిగిన నేపథ్యంలో ఈ నిబంధనల అమలును ప్రస్తుతానికి పక్కనబెట్టారు. ఈ మూడు నూతన చట్టాలకు గత ఏడాది డిసెంబర్‌ 21న పార్లమెంట్‌ ఆమోదం తెలపగా డిసెంబర్‌ 25వ తేదీన రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్, కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసిజర్, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌1872ల స్థానంలో ఈ మూడు చట్టాలు తెచి్చన సంగతి తెల్సిందే.

దోషులను శిక్షించడంకంటే ముందు బాధితులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతోనే ఈ చట్టాలను తెచ్చామని బిల్లులపై చర్చ సందర్భంగా పార్లమెంట్‌లో హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఐపీసీలో లేని ఉగ్రవాదం అనే దానికి తొలిసారిగా కొత్త చట్టంలో సరైన నిర్వచనం పొందుపరిచారు. రాజదోహ్రం అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ‘దేశ వ్యతిరేక నేరాలు’ అనే సెక్షన్‌ను జతచేశారు.

వేర్పాటువాదం, సాయుధపోరాటాలు, దేశ సార్వ¿ౌమత్వాన్ని భంగపరిచే చర్చలు, దేశ, విదేశాల్లో ఉంటూ చేసే విధ్వంసకర కుట్రలు, దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే కుట్ర విద్వేష ప్రసంగాలు.. ఇలా పలు రకాల నేరాలను ఇకపై దేశవ్యతిరేక నేరాలుగా పరిగణిస్తారు. ఈ నేరాలకు గరిష్టంగా జీవితఖైదు పడొచ్చు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించి దేశద్రోహం అనే నిర్వచించారు. దోషులకు మేజిస్ట్రేట్‌ విధించే జరిమానా మొత్తాలను పెంచారు. అన్ని భాగస్వామ్య వర్గాల సలహాలు, సూచనలు స్వీకరించి సమగ్ర చర్చలు, సంప్రతింపుల తర్వాతే ముసాయిదా బిల్లులు చట్టాలుగా రూపుదాల్చాయని అమిత్‌ షా అన్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)