Breaking News

చంద్రయాన్‌–5 మిషన్‌కు ప్రభుత్వ ఆమోదం

Published on Tue, 03/18/2025 - 06:09

న్యూఢిల్లీ: చంద్రయాన్‌–5 మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్‌ వి.నారాయణన్‌ తెలిపారు. ఇది 250 కిలోల భారీ రోవర్‌ను చంద్రుడి ఉపరితలంపైకి తీసుకెళ్తుందన్నారు. చంద్రుడి ఉపరితలం, కూర్పుపై సమగ్ర అధ్యయనం ఈ అధునాతన రోవర్‌ లక్ష్యమని ఆయన వెల్లడించారు. చంద్రయాన్‌–5 మిషన్‌కు మూడు రోజుల కిందటే అనుమతి లభించిందని, జపాన్‌ సహకారంతో దీన్ని చేపడతామని తెలిపారు. 

చంద్రయాన్‌ను ఇండియన్‌ లూనార్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ప్రోగ్రామ్‌ అని కూడా పిలుస్తారు. చంద్రుని మీద అన్వేషణ కోసం భారత్‌ చేస్తున్న ఐదో ప్రయోగం ఇది. చంద్రయాన్‌–3 అద్భుత విజయం సాధించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన తొలి దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది. చంద్రయాన్‌–3.. 25 కిలోల రోవర్‌ను తీసుకెళ్లగా, చంద్రయాన్‌–5 మిషన్‌  250 కిలోల బరువున్న రోవర్‌ను తీసుకెళ్లనుంది.  ఇక 2019లో ప్రయోగించిన చంద్రయాన్‌–2కు చివరిదశలో ఎదురుదెబ్బ తగిలింది.  2027 నాటికి చంద్రయాన్‌–4ను ప్రయోగించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. 

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)