Breaking News

సీబీఐ చీఫ్‌ ప్రవీణ్‌ సూద్‌కు ఏడాది పొడిగింపు

Published on Thu, 05/08/2025 - 03:52

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. ఈ మేరకు కేబినెట్‌ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. సీబీఐ డైరెక్టర్‌ నియామక కమిటీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రవీణ్‌ సూద్‌ పదవీకాలాన్ని పొడిగించారు. ప్రవీణ్‌ 2023 మేలో సీబీఐ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సుబోధ్‌ జైస్వాల్‌ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. 

సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ యాక్ట్‌–2003 ప్రకారం సీబీఐ డైరెక్టర్‌ పదవీకాలం రెండేళ్లు. ప్రవీణ్‌ సూద్‌ రెండేళ్ల పదవీకాలం మే 24తో ముగియనుంది. దీంతో సీబీఐ చీఫ్‌ను ఎన్నుకోవడానికి ప్రధాని మోదీ ఎంపిక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా కూడా హాజరయ్యారు. అయితే ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రవీణ్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

ప్రవీణ్‌ సూద్‌ 1986 బ్యాచ్, కర్ణాటక కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. 1989లో మైసూరులో అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. బళ్లారి, రాయచూర్‌ ఎస్పీగా పనిచేసి బెంగళూరులో డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌(డీసీపీ)గా నియమితులయ్యారు. డిప్యూటేషన్‌పై మూడేళ్ల పాటు మారిషస్‌లో పనిచేశారు. 2004 నుంచి 2007 వరకు మైసూరు నగర పోలీసు కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2011 వరకు బెంగళూరు ట్రాఫిక్‌ పోలీస్‌లో అడిషనల్‌ పోలీస్‌ కమిషర్, 2013–14 వరకు కర్ణాటక స్టేట్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, ఆ తరువాత రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా, కర్ణాటక స్టేట్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఏడీజీపీగా, అడ్మినిస్ట్రేషన్‌ ఏడీజీపీగా, కర్ణాటక డీజీపీగా పనిచేశారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)