భారత రత్న.. కేంద్రం సరికొత్త రికార్డు

Published on Fri, 02/09/2024 - 19:19

న్యూఢిల్లీ: దేశ చరిత్రలో తొలిసారి ఈ ఏడాదిలోనే ఐదుగురికి భారతరత్న ప్రకటించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో ఒకే సంవత్సరంలో ఎక్కువమందికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించినట్లయింది. గతంలో 1999లో నలుగురికి భారతరత్న ప్రకటించడమే ఇప్పటివరకు రికార్డు.

ఈ ఏడాది భారతరత్న దక్కించుకున్నవారితో కలిపి భారతరత్నాల జాబితాలో ఇప్పటివరకు చోటు దక్కించుకున్న వారి సంఖ్య మొత్తం 53కు చేరింది.కేంద్ర ప్రభుత్వం 1954లో అత్యున్నత పౌర పురస్కారాలైన భారతరత్న, పద్మవిభూషణ్‌లను ఏర్పాటుచేసింది. ఏదైనా రంగంలో అసాధారణ సేవలు అందించి అత్యున్నత స్థాయి పనితీరు కనబరిచిన వారికి భారతరత్న ఇస్తారు.

ఈ పురస్కారానికి సంబంధించిన సిఫార్సులను ప్రధాని రాష్ట్రపతికి అందజేస్తారు. ప్రధాని చేసే సిఫారసు తప్ప ఎలాంటి కేంద్ర ప్రభుత్వం ఇతర అధికారిక సిఫారసులేవి రాష్ట్రపతికి వెళ్లవు. అవార్డు కింద రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువపత్రం, భారతరత్న పతకం అందిస్తారు. ఎలాంటి నగదు ఇవ్వరు. 

ఇదీ చదవండి.. 8 మంది ఎంపీలతో ప్రధాని లంచ్‌.. స్వయంగా బిల్లు చెల్లింపు 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)