Breaking News

ఓటర్‌ కార్డ్‌తో ఆధార్‌ లింక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

Published on Tue, 03/18/2025 - 17:58

ఢిల్లీ : ఓటర్‌ ఐడీకి ఆధార్‌ (Linking of Aadhaar with Voter ID) అనుసంధానం చేసుకునేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఆధార్‌ కార్డ్‌తో ఓటర్‌ ఐడీ అనుసంధాన ప్రక్రియను కేంద్రం ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.

ఓటరు ఐడీల్లో అవకతవకలు జరుగుతన్నాయని ఇటీవల అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఓట‌రు కార్డును.. ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే అంశంపై మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది.   కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నిర్వచన్ సదన్‌లో భార‌త ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar), ఈసీలు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు  డాక్టర్ వివేక్ జోషి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ, యూఐడీఏఐ, ఈసీఐ సాంకేతిక నిపుణులు భేటీ అయ్యారు.

ఈ భేటీ ప్రధాన ఉద్దేశ్యం అర్హులైన వారందరికీ ఓటర్లుగా నమోదు చేసుకోనే అవకాశం కల్పించడంతో పాటు నకిలీ ఐడీ కార్డులను తొలగించడం వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ చర్చలో ఓటర్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

ఈపీఐసీని ఆధార్‌తో లింక్ చేయడం కోసం ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఆధార్ కార్డు ఓటర్ కార్డు అనుసంధానానికి ఎన్నికల సంఘం నిర్ణయించింది.ఈసీ నిర్ణయంతో త్వరలో యూఐడీఏఐ,ఈసీఐ నిపుణుల మధ్య సాంకేతిక ప్రక్రియ ప్రారంభం కానుంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం, భారత పౌరుడికి మాత్రమే ఓటు హక్కు. ఆధార్ కార్డు ద్వారానే పౌరుడి గుర్తింపు నిర్ధారణ. ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం1950లోని సెక్షన్ 23(4), 23(5), 23(6)లోని నిబంధనల ప్రకారం, సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా మాత్రమే జరుగుతుందని నిర్ణయించబడింది అని కేంద్రం ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)