Breaking News

ప్రణబ్‌ స్మారకం..స్థలం కేటాయించిన కేంద్రం

Published on Tue, 01/07/2025 - 20:13

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ప్రణబ్‌ ముఖర్జీ(Pranab Mukherjee) స్మృతి వననానికి కేంద్రం స్థలం కేటాయించింది. రాజ్‌ఘాట్‌ కాంప్లెక్స్‌లోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లోనే ప్రణబ్‌ ముఖర్జీ స్మారక వనానికి స్థలం కేటాయించారు. ఈ విషయమై కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చిన లేఖను ప్రణబ్‌ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ విడుదల చేశారు.

తన తండ్రి స్మారకానికి స్థలం కేటాయించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీని(Narendra Modi) ప్రత్యేకంగా కలిసిన షర్మిష్ట ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక ఊహించని,గొప్ప నిర్ణయమని కొనియాడారు.కాగా, ఇటీవల మాజీ ప్రధాని స్మారక చిహ్నం నిర్మాణానికి స్థలం కేటాయించడంపై వివాదం సందర్భంగా షర్మిష్ట కాంగ్రెస్‌ విమర్శలను తిప్పికొట్టారు.

తన తండ్రి ప్రణబ్‌ మరణించినపుడు కాంగ్రెస్‌(Congress) చేసిన అన్యాయాన్ని బయటపెట్టారు. ఇంతలోనే ప్రణబ్‌ముఖర్జీ స్మారక సమాధికి కేంద్రం స్థలం కేటాయించడం గమనార్హం. కాగా, ప్రణబ్‌ముఖర్జీ భారత రాష్ట్రపతిగా 2012 నుంచి 2017 వరకు పనిచేశారు. 2020 ఆగస్టులో ఆయన తుదిశ్వాస విడిచారు. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)