Breaking News

తమిళనాడు: అన్నామలైకు జెడ్‌ కేటగిరి భద్రత

Published on Sat, 01/14/2023 - 07:16

సాక్షి, చెన్నై: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు జెడ్‌కేటగిరి భద్రతకు కేంద్రం ఆదేశించింది.  ఆయనకు ఇద్దరు ప్రత్యేక భద్రతాధికారులతో పాటు పది మంది సీఆర్‌పీఎఫ్‌ బృందంతో ప్రత్యేక భద్రతకు చర్యలు చేపట్టారు. ఈయన కర్ణాటకలో ఐపీఎస్‌ అధికారిగా పనిచేస్తూ 2019లో తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపించారు. 

అయితే పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని రజనీకాంత్‌ విరమించుకోవడంతో వ్యవసాయం చేసుకుంటానని అన్నామలై ప్రకటించారు. చివరకు బీజేపీలో చేరారు. తొలుత కరూర్‌ జిల్లా రాజకీయాలకు పరిమితమయ్యారు. 2021 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆయన్ను వరించింది. అప్పటి నుంచి దూకుడుగానే ముందుకు వెళ్తున్నారు. సొంత పారీ్టలోనూ అన్నామలైకు వ్యతిరేకత ఉన్నా, వాటిని ఏ మాత్రం ఖాతరు చేయకుండా బలోపేతం లక్ష్యంగా ఉరకలు తీస్తున్నారు. సీనియర్లందరిని పక్కన పెట్టి, యువతరానికి పెద్ద పీట వేస్తున్నారు. అధికార డీఎంకే, వారి మిత్రపక్షాలతో వైర్యం పెంచుకోవడమే కాకుండా నిత్యం మాటల తూటాలను పేల్చుతూ వార్తల్లో నిలుస్తున్నారు. 

ఇటీవల పరిణామాలతో భద్రత పెంపు 
ఇటీవల బీజేపీతో పాటు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అన్నామలైకు భద్రత కల్పించాల్సిన అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. ఆయనకు జెడ్‌ కేటగిరి భద్రత కల్పించే విధంగా కేంద్రం శుక్రవారం ఆదేశించింది. ఆయనకు భద్రతగా ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించేందుకు నిర్ణయించింది. అలాగే, పది మంది సీఆర్‌పీఎఫ్‌ బృందం నిత్యం భద్రతా విధుల్లో ఉండబోతోంది. ఇకపై తుపాకీ నీడలో అన్నామలై పర్యటనలు జరగనున్నాయి. ఆయన భద్రతను కేంద్రం పర్యవేక్షించనుంది.   

Videos

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

Photos

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)