Breaking News

త్వరలో ప్రతి రైలులో ‘పాతాళ గంగ’.. అడక్కుండానే వాడుక నీరు!

Published on Sat, 09/30/2023 - 11:06

మనం రైలులో ప్రయాణించినప్పుడు ఏదో ఒక సందర్భంలో రైలు టాయిలెట్‌లో లేదా బయట వాష్‌ బేసిన్‌ వద్ద నీరు లేకపోవడాన్ని గమనించే ఉంటాం. లేదా ఎవరో ఒకరు ఇటువంటి ఫిర్యాదు చేయడాన్ని మనం వినేవుంటాం. వేలాది మంది ప్రయాణికులతో రైలు రాకపోకలు సాగిస్తుంటుంది. అందువల్ల ప్రయాణికులందరికీ అందుబాటులో సరైన సౌకర్యాలు కల్పించడం రైల్వేశాఖకు పెద్ద సవాలే. 

ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు రైలు ప్రయాణం మధ్యలో నీటి కొరత లాంటి సందర్భాలు తలెత్తుతాయి. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఇకపై ఇలాంటి పరిస్థితి ఎదురుకాదు. ఇకపై రైలులోని టాయిలెట్, వెలుపలి వాష్‌బేసిన్‌ దగ్గర నీరు అయిపోవడమన్నదే ఉండదు. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వేశాఖ కొత్త సాంకేతికతను ఉపయోగించనుంది. భారతీయ రైల్వే ఇందుకోసం ఐఓటీ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ఉపయోగించనుంది.

ఐఓటీ అంటే అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సమస్య పరిష్కారంలో ఇంటర్నెట్ ఉపయోగించినప్పుడు, దానిని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటారు. ఇకపై రైలు ట్యాంక్‌లోని నీటిని పర్యవేక్షించడానికి ఐఓటీని ఉపయోగించనున్నారు. ఇది ప్రతి బోగీకీ వర్తింపజేయనున్నారు. ఈ విషయాన్ని సెంట్రల్ రైల్వే సీపీఆర్వో తెలియజేశారు. 

ఈ సాంకేతికత ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. ఇప్పటి వరకు 3 రైళ్లలోని 11 కోచ్‌లలో దీనిని పరీక్షించారు. ఈ టెక్నిక్  విజయవంతమైంది. త్వరలో మిగతా రైళ్లలో కూడా అమలు చేయనున్నారు. ప్రయాణం సాగిస్తున్న రైలులో వాటర్ ట్యాంక్‌లోని నీరు 40 శాతం కన్నా తగ్గినప్పుడు ఈ సమాచారం రైల్వే సిబ్బందికి అందుతుంది. దీంతో తదుపరి స్టేషన్‌లో ఆ రైలు ట్యాంక్‌లో నీరు నింపుతారు. ఈ విధంగా రైళ్లలో నీటి కొరతకు పరిష్కారం లభించనుంది.
ఇది కూడా చదవండి: నింగిలో ‘నీలి సూరీడు’.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)