Breaking News

World TB Day: 50 వేల గ్రామాల్లో జీరో కేసులు

Published on Mon, 03/24/2025 - 07:59

నేడు ప్రపంచ టీబీ నిర్మూలన దినోత్సవం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు(సోమవారం) టీబీ నిర్మూలనకు విశేషంగా కృషి చేసిన రాష్ట్రాలకు ప్రత్యేక గౌరవం అందించనుంది. భారతదేశ 100 రోజుల టీబీ నిర్మూలన ప్రచారం విజయవంతం అయిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ టీబీ వ్యతిరేక పోరాటాన్ని 300 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించింది.

ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం(World Tuberculosis Day) సందర్భంగా సోమవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. దేశంలోని 50 వేల గ్రామాలు టీబీ నుండి విముక్తి పొందినందున ఆయా గ్రామాలకు ధ్రువీకరణ పత్రాలను అందజేయనున్నారు. గత రెండేళ్లలో ఈ గ్రామాల్లో ఒక్క టీబీ కేసు కూడా నమోదు కాలేదు. టీబీ ఇన్ఫెక్షన్‌కు సంబంధించి మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్, మేఘాలయలు అగ్రస్థానంలో ఉన్నాయి. టీబీ చికిత్సలో ఔషధాలతో పాటు పోషకాహారం పాత్ర  ఎంతో ముఖ్యమైనది. టీబీ బాధితులకు పోషకాహారం అందించడంపై  మేఘాలయ ప్రత్యేక చొరవ తీసుకుంది. బాధితులను ఆరోగ్య కేంద్రాలకు తీసుకు వచ్చేందుకు గ్రామీణ మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌ కూడా టీబీ నిర్మూలన విషయంలో విశేష కృషి చేసింది.

క్షయ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ బాక్టీరియా(Tuberculosis bacteria) వల్ల కలిగే అంటు వ్యాధి. ఇది సాధారణంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, నవ్వినప్పుడు లేదా అరచినప్పుడు కూడా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. 2024లో దేశంలో 26.19 లక్షల మంది టీబీ రోగులను గుర్తించారు. ఇది నిర్దేశించిన లక్ష్యంలో 94 శాతం. భారతదేశం 2025 నాటికి టీబీని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా జిల్లా, గ్రామ పంచాయతీ స్థాయిలో ఈ వ్యాధి నిర్మూలనకు విరివిగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా 50 వేలకు పైగా గ్రామాలు టీబీ రహితంగా మారాయి. 

ఇది కూడా చదవండి: New Delhi: తృటిలో తప్పిన తొక్కిసలాట 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)