Breaking News

ఇండిగోపై కేంద్రం యాక్షన్‌ షురూ..!

Published on Sat, 12/06/2025 - 17:25

గత కొద్ది రోజులుగా దేశీయ విమానయాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇండిగో సంస్థకు చెందిన విమానాలు హఠాత్తుగా రద్దు కావడంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో వేలమంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంక్షోభానికి కారణమైన ఇండిగో సంస్థపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ ను తొలగించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.     

దేశీయ విమానాయాన సంస్థ ఇండిగో నిర్వాకంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ఐదో రోజు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. విమానాలు రద్దయ్యే సమాచారం ప్రయాణికులకు ఇవ్వకపోవడంతో  వారంతా విమానాశ్రయాలలో చిక్కుకొని తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇండిగో సంస్థ కావాలనే ఈ విధంగా చేసిందని కేంద్రం భావిస్తోంది. దీంతో  ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ పై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఈఓ పదవి నుంచి ఆయనను తొలగించడంతో పాటు పెద్ద మెుత్తంలో జరిమానా విధించనున్నట్లు సమాచారం.

ఈ మేరకు కేంద్ర విమానయాన సంస్థ ఈ రోజు సాయంత్రం కీలక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ భేటీకి ఇండిగో సంస్థ యాజమాన్యం తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ భేటీలో ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించే అవకాశం ఉంది.ప్రస్తుత ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ 2022లో బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన కేఎల్ఎమ్ రాయల్ డచ్ ఎయిర్ లైన్స్ కి సీఈఓగా వ్యవహరించారు.

కాగా ఇండిగో ఘటనపై ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ క్షమాపణలు చెప్పారు. అంతర్గతంగా చర్యలు తీసుకోవడంలో సంస్థ విఫలమైందని అంగీకరించారు. అంతర్గతంగా అన్నీ షెడ్యూళ్లను రీబూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరో 5-10 రోజుల్లో ఇండిగో కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని పీటర్ ఎల్బర్స్ తెలిపారు. 

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)