Breaking News

ఎన్‌సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యాంశంపై కేంద్రం సీరియస్‌

Published on Wed, 02/25/2026 - 17:29

ఢిల్లీ: ఎన్‌సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యాంశంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో కేంద్రం చర్యలకు సిద్ధమైంది. సిలబస్‌ రూపొందించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది. ఇలాంటి సిలబస్‌తో పిల్లలపై  చెడు ప్రభావం పడుతుందని కేంద్రం పేర్కొంది.

కాగా, సుప్రీం వార్నింగ్‌తో ఎన్సీఈఆర్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. "న్యాయవ్యవస్థలో అవినీతి" అనే సెక్షన్‌ను ఎనిమిదో తరగతి పాఠ్యాంశం నుంచి ఎన్సీఈఆర్టీ తొలగించనుంది. న్యాయవ్యవస్థపై ప్రతికూల అంశాల కంటే, స్ఫూర్తిదాయక  అంశాలు రాయాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

న్యాయ వ్యవస్థలో అవినీతి అనే పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. న్యాయ వ్యవస్థను కించపరిచే ప్రయత్నాలను సహించమంటూ ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై తగ్గిన చర్యలు తీసుకుంటామని సీజేఐ వెల్లడించారు. న్యాయవ్యవస్థకు ఉన్న అతిపెద్ద సవాళ్లు  అవినీతి, న్యాయమూర్తుల ఖాళీలంటూ ఎన్సీఈఆర్టీ ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకం పేర్కొంది.

న్యాయ వ్యవస్థను అవినీతి మయమని పేర్కొనడం ఆందోళనకరమంటూ  సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింగ్వి.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాన్ని సుమోటో కేసుగా విచారించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవ్యవస్థను కించపరిచేందుకు  ఉద్దేశపూర్వకంగా చేశారని, తీవ్రంగా పరిగణిస్తున్నానని.. తగిన చర్యలు తీసుకుంటామని సీజేఐ  తెలిపారు.

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)