Breaking News

ఇండిగోకు కేంద్రం తీవ్ర హెచ్చరిక

Published on Sat, 12/06/2025 - 15:09

మూడు రోజులుగా దేశ వైమానిక రంగంలోసంక్షోభం సృష్టించిన ఇండిగో సంస్థపై కేంద్రం సీరియస్‌ అయ్యింది. విమానాల ఆకస్మిక రద్దు, ప్రయాణ వాయిదాల నివారణకు తగిన ప్రత్యామ్నాయలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఇండిగో పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికుల టికెట్ రద్దు రీఫండ్ ను ఆలస్యం చెయవద్దని వారికి  రేపు రాత్రి 8లోపు డబ్బులు తిరిగివ్వాలని తీవ్రంగా హెచ్చరించింది. దేశీయ విమానయాన సంస్థ ఇండిగోపై కేంద్రం తీవ్రస్థాయిలో మండిపడింది. ఫ్లైట్స్ క్యాన్సిల్ వల్ల వేలాది మంది ఇబ్బందులు పడుతుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఇండిగో పూర్తిగా విఫలమైందని తెలిపింది. 

ఉద్దేశపూర్వకంగానే విమానాల సంక్షోభం సృష్డించి దానికి డీజీసీఏ నిబంధనలు సాకుగా చూపుతుందని ఆరోపించింది. లక్షలాది ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంస్థకు ఏమాత్రం పట్టడం లేదని దానిని కనీసం లెక్కచేయడం లేదని ఆరోపించింది. రద్దైన విమానాల సమాచారం కోసం వెంటనే ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఇండిగోకు ఆదేశాలు జారీ చేసింది. 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు  కేంద్ర విమానయాన శాాఖ కీలక సమావేశం నిర్వహించనుంది.  ఈ సమావేశానికి ఇండిగో యాజమాన్యం తప్పనిసరిగా హాజరుకావాలని  ఆదేశించింది. కాగా డీజీసీఏ తీసుకొచ్చిన కొత్త రూల్స్ వల్లే ఈ సమస్య ఏర్పడిందని ఇండిగో సంస్థ  ప్రకటించింది. అయితే ఆ రూల్స్ ని డీజీసీఏ  తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నప్పటికీ పరిస్థితుల్లో మాత్రం మార్పు కన్పించడం లేదు. 

ప్రయాణికులకు విమానాలు రద్దైన ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో వారంతా విమానాశ్రయాలలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇండిగో సంస్థ కావాలనే వారికి ఈ సమాచారం అందించలేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీజీసీఏ తెచ్చిన కొత్తరూల్స్ వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చేందుకే ఇండిగో సంస్థ కావాలనే ఈ కృత్తిమ సంక్షోభాన్ని సృష్టించిందనే ఆరోపణలు వస్తున్నాయి. 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)