Breaking News

జర్మనీతో పీ–75ఐ సబ్‌మెరీన్‌ ఒప్పందానికి కేంద్రం ఓకే

Published on Sun, 08/24/2025 - 05:27

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్‌ 75 ఇండియా(పీ–75ఐ)కింద ఆరు అత్యాధునిక జలాంతర్గాములను సమకూర్చుకునేందుకు జర్మనీతో చర్చలు జరిపేందుకు రక్షణ శాఖకు అనుమతి మంజూరు చేసింది. జాతీయ భద్రతా విభాగం, రక్షణ శాఖ అధికారుల మధ్య జరిగిన భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జర్మనీ సంస్థతో ఈ నెలాఖరులోనే చర్చలు మొదలయ్యే అవకాశా లున్నాయని సమాచారం. 

కొత్తగా సమకూర్చుకునే ఆరు సబ్‌మెరీన్లలో ఎయిర్‌ ఇండిపెండెంట్‌ పొపల్షన్‌(ఏఐపీ)వ్యవస్థలుంటాయి. దీనివల్ల ఈ జలాంతర్గాములు కనీసం మూడు వారాలపాటు నీటి అడుగునే ఉండే సామర్థ్యముంటుంది. జర్మనీ సంస్థతో సంప్రదింపులను 8 నెలల్లో పూర్తి చేసి, ఒప్పందం ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని రక్షణ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 

రక్షణ శాఖ, మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌(ఎండీఎల్‌)లు నిర్మించతలపెట్టిన తరువాతి తరం సబ్‌మెరీన్లకు ఏఐపీ సాంకేతికతే కీలకం. జర్మన్‌ సంస్థ నుంచి అందే ఈ సాంకేతికతతో దేశీయంగా సబ్‌మెరీన్లను డిజైన్‌ చేసుకుని, నిర్మించనున్నారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో భారత వ్యూహాత్మక అవసరాల రీత్యా ఇటువంటి జలాంతర్గాముల అవసరం ఎంతో ఉందని నిపుణులు అంటున్నారు. వచ్చే పదేళ్లలో నేవీ నుంచి కనీసం పది పాతబడిన జలాంతర్గాములను విధుల నుంచి తప్పించే అవకాశముంది.   

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)